Site icon HashtagU Telugu

Seniors Ragging: జూనియర్లపై సీనియర్ ఎన్‌సీసీ క్యాడెట్ల జులుం.. వీడియో వైరల్

Ncc Seniors Ragging

Seniors Ragging: ‘ఎన్‌సీసీ’ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. అలాంటి ఎన్‌సీసీలో శిక్షణ పొందే విద్యార్థులే తోటి ఎన్‌సీసీ విద్యార్థులతో రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. మన శక్తి సామర్థ్యాలను దేశ రక్షణ కోసం వినియోగించాలని ఎన్‌సీసీ బోధిస్తుంది. కానీ ఆ ఎన్‌సీసీ క్యాడేట్స్ తమ జూనియర్లను వేధించడానికి వాడారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

We’re now on WhatsApp. Click to Join

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా(Palnadu) నరసరావుపేటలో శ్రీసుబ్బరాయ అండ్‌ నారాయణ(ఎస్‌ఎస్‌ అండ్‌ ఎన్‌) కళాశాల ఉంది. ఇక్కడే ఎన్‌సీసీ సీనియర్ క్యాడేట్స్.. జూనియర్ క్యాడేట్స్‌ను(Seniors Ragging) కర్రలతో చితకబాదారు.  ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 3,4 తేదీలలో చీరాలలో జరగనున్న ఎన్‌సీసీ బీ– సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు వెళ్లే 20 మంది జూనియర్ ఎన్‌సీసీ క్యాడెట్లను సీనియర్లు ఆ నెల 2వ తేదీన అర్ధరాత్రి చితక్కొట్టారు. ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.

Also Read :Mancherial : గొడుగులతో పాఠాలు వింటున్న విద్యార్థులు.. ఆ స్కూలులో దయనీయ పరిస్థితి

క్యాడెట్ల పరేడ్‌ను పర్యవేక్షించాల్సిన ఎన్‌సీసీ ఆఫీసర్‌ డ్రిల్‌ సమయంలో అందుబాటులో ఉండరని.. దీంతో ఆ టైంలో సీనియర్ ఎన్‌సీసీ క్యాడెట్లే పెత్తనం చలాయిస్తుంటారని బాధిత విద్యార్థులు మీడియాకు తెలిపారు. డ్రిల్‌ ఉన్న రోజు సాయంత్రం ఆలస్యంగా  హాజరయ్యే క్యాడెట్లను క్రమశిక్షణ పేరుతో నిత్యం ఇలాగే సీనియర్ క్యాడెట్లు చిత్రహింసలకు గురిచేస్తుంటారని బాధిత విద్యార్థులు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఎస్‌ అండ్‌ ఎన్‌ కళాశాల యాజమాన్యం నోరు విప్పడం లేదు.వీడియో వైరల్‌ కావడంతో స్పందించిన వన్‌టౌన్‌ సీఐ కృష్ణారెడ్డి బుధవారం ఉదయం కళాశాల హాస్టల్‌కు వెళ్లారు. అక్కడ దాడిలో గాయపడిన విద్యార్థులను ఘటనపై ఆరా తీశారు. తమపై సీనియర్లు అజయ్‌కుమార్, గోపీకృష్ణ మరో నలుగురు కలిసి దాడి చేశారని సీహెచ్‌ పాల్‌ థామస్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

Also Read :Green Tea: స్త్రీలు గ్రీన్ టీ తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?