Site icon HashtagU Telugu

BJP : నామినేటెడ్ పదవులపై అధిష్టానం నిర్ణయం : పురంధేశ్వరి

Purandeswari participating in Holi celebrations

Purandeswari participating in Holi celebrations

BJP: రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విజయవాడలో మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నివాసంలో హోలీ సంబరాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. సీనియర్ కార్యకర్త సోము వీర్రాజు.. ఎమ్మెల్సీగా ఆయన పార్టీ తరఫున కౌన్సిల్ లో పని చేస్తారు. బీజేపీ మొదటి నుంచీ ప్రజావాణి మావాణి అని చెపుతోంది. ప్రధాని మోడీ ఎప్పుడో చెప్పారు భారతీయ జనతా పార్టీ విశ్వసించిన విధానం ప్రజావాణి వినిపించడం. అయితే నామినేటెడ్ పదవులు గురించి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Read Also: Jana Sena 12th Foundation Day : జనసేన విజయం వెనుక అసలు కారణాలు ఇవే

ఇక సుహృద్భావ వాతావరణంలో అందరం నిర్వహించుకునే పండగ హోళీ అని ఆమె తెలిపారు. అదే విధంగా హోళీ వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ..ప్రతిసారి విశాఖలో లేదా విజయవాడలో జరుపుకుంటాం అన్నారు. ఇక ఈ హోళీ సంబరాలకు కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ హాజరయ్యారు. ఈ సంబరాలలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎంఎల్ఏ నడికుదిటి ఈశ్వరరావు, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సంబరాలలో రంగులు చల్లుకుంటూ హోలీ ఘనంగా నిర్వహించారు.

నామినేటెడ్ పదవులలో కొన్నిసార్లు ఉన్న అసమతుల్యతలు, సాంఘిక న్యాయం, అన్యాయం అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త నియామకాలు చేయాలని అధికారులు భావించారు. “ప్రజల ఆశీస్సులతో సమతుల్యమైన వారిని ఎన్నిక చేసి, సక్రమంగా పనులు ముందుకు తీసుకువెళ్ళడం మా లక్ష్యం” అని పురంధేశ్వరి చెప్పారు. రాజకీయవర్గాలలో రాణించిన నామినేటెడ్ పదవుల ప్రభావాన్ని మరింత పెంచే అవకాశం కలిగిస్తుంది. ముఖ్యంగా, రాష్ట్రంలోని పలు వర్గాలు, వలస ఆత్మగౌరవంతో నోటిఫికేషన్లు, నియామకాలు కొరకు పెద్దగా ఎదురుచూస్తున్నాయి. ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి సహాయపడేలా కచ్చితంగా తీసుకోవాలని పురంధేశ్వరి పేర్కొన్నారు.

Read Also: Success : ఎంతకష్టపడిన సక్సెస్ కాలేకపోతున్నారా..? అయితే ఇది మీకోసమే