Site icon HashtagU Telugu

Daggubati Purandeswari: నడ్డాను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి

Daggubati Purandeswari

New Web Story Copy 2023 07 06t171919.596

Daggubati Purandeswari: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డాని కలిశారు. గురువారం ఆమె ఢిల్లీలో నడ్డాతో భేటీ అయి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టినందుకు ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఏపీలో భాజపాను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లే, ఏపీ, ఆంధ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు కూడా కృషి చేస్తానని ఆమె అన్నారు.

కాగా ఏపీ బీజేపీ చీఫ్ గా పురంధేశ్వరిని నియమించిన రెండు రోజుల తరువాత ఆమె స్పందించడంపై రాజకీయంగా అనుమానాలు లేవనెత్తుతున్నారు. తనకు కేటాయించిన పదవిపై ఆమె సానుకూలంగా లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక తెలంగాణ, జార్ఖండ్ మరియు పంజాబ్ రాష్ట్రాలకు కొత్త రాష్ట్రాల చీఫ్‌ల నియామకంతో పాటు జూలై 4న మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరిని రాష్ట్ర బిజెపి చీఫ్‌గా నియమించారు.

Read More: TDP : తిరువూరు, పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల‌పై చంద్ర‌బాబు స‌మీక్ష‌.. నాయ‌కుల‌కు అధినేత క్లాస్‌..?