Site icon HashtagU Telugu

Purandeswari: పురందేశ్వరికి ఢిల్లీ నుంచి పిలుపు.. ఏపీ బీజేపీలో ఏం జరగబోతోంది ?

Daggubati Purandeswari Bjp High Command Delhi Ap bjp

Purandeswari : బీజేపీ హైకమాండ్ ఏపీలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో బీజేపీని స్ట్రాంగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈనేపథ్యంలో ఏపీలో పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. ఈక్రమంలోనే ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి ఢిల్లీలోని పార్టీ పెద్దల నుంచి  పిలుపు వచ్చింది. ఇంతకీ బీజేపీ పెద్దల మదిలో ఏముంది ?  పురందేశ్వరికి బీజేపీ పెద్దలు ఇవ్వబోతున్న నిర్దేశాలు ఏమిటి ?

Also Read :Elon Musk Vs Indian Voters: భారత్‌లో ఓటింగ్‌.. నిధులు ఆపేసిన అమెరికా.. బీజేపీ సంచలన రియాక్షన్

పురందేశ్వరికి జాతీయ స్థాయి పదవి ?

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి(Purandeswari) గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో చక్కగా వ్యవహరించారు. పార్టీ శ్రేణులను సమర్ధంగా ముందుకు నడిపించారు. కూటమిలోని టీడీపీ, జనసేన క్యాడర్‌తో బీజేపీ శ్రేణులు టీమ్ స్పిరిట్‌తో కలిసి పనిచేశాయంటే..  దానికి కారణం పురందేశ్వరి నాయకత్వ పటిమ. ఈవిషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గుర్తించారు. కష్టపడి పనిచేసే నేతలకు బీజేపీలో తగిన గుర్తింపు ఉంటుంది.  ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎంపికపై పార్టీ పెద్దలు ఇప్పుడు క్లారిటీకి వచ్చారని తెలుస్తోంది. ఆ విషయాన్ని చెప్పడానికే పురందేశ్వరిని ఢిల్లీకి పిలిచారని సమాచారం. తదుపరిగా పురందేశ్వరికి జాతీయ స్థాయిలో పార్టీ పదవిని అప్పగిస్తారని అంచనా వేస్తున్నారు.  అయితే ఏపీ బీజేపీ చీఫ్‌గా ఎంపికైన ఆ నేత ఎవరు ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read :Bill Gates A Farmer : ‘వ్యవసాయం’లోనూ దునియాను దున్నేస్తున్న బిల్‌గేట్స్ .. ఎలా ?

ఆ నలుగురు.. 

ఏపీ బీజేపీ చీఫ్‌ రేసులో ప్రధానంగా నలుగురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో విజయవాడ వెస్ట్‌ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎమ్మెల్సీ మాధవ్‌,  మాజీ సీఎం కిరణ్‌ కుమార్ రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పి.వీ పార్థసారథి ముందు వరుసలో ఉన్నారు. వీరిలో ఎవరిని రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.  రామచంద్రా రెడ్డి, ఇసుక సునీల్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా ఈ కీలకమైన పోస్టు కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై ఈ నెలాఖరుకల్లా బీజేపీ పెద్దలు క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేతల గురించి.. పురందేశ్వరి నుంచి బీజేపీ పెద్దలు ఫీడ్‌బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. ఆమె ఇచ్చే నివేదిక కూడా రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో కీలక పాత్ర పోషించనుంది.