ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) కుటుంబంతో కలిసి తన స్వస్థలమైన కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివపురంలో నిర్మించిన తన కొత్త ఇంటిలో ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటలకు సంప్రదాయబద్ధంగా గృహప్రవేశం (Chandrababu House Ceremony) చేశారు. ఈ శుభకార్యానికి కుటుంబ సభ్యులైన భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రహ్మిణి తదితరులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గృహప్రవేశానికి ఆవును పావనంగా భావించి ఇంట్లోకి తీసుకువచ్చారు.
Avoid Milk: ఈ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా పాలను తాగకూడదట.. ఎవరో తెలుసా?
గృహప్రవేశంలో ప్రత్యేకంగా పుంగనూరు జాతి ఆవులను (Punganur Cows) వినియోగించారు. ఈ ఆవులు చిత్తూరు జిల్లాకు ప్రత్యేకమైనవిగా పేరుగాంచాయి. పుంగనూరు ఆవులు చిన్నపాటి ఆకారంలో ఉండి, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇవి సాధారణ ఆవుల దూడలంత పరిమాణంలో ఉండటంతో వీటిని తొలిసారి చూసినవారు తికమకపడతారు. కాళ్లు చిన్నగా ఉండి, ఎత్తు సుమారు 70 నుంచి 90 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. బరువు సగటున 115 నుంచి 200 కిలోల వరకు ఉంటుంది.
ఈ జాతి ఆవుల పాలకు ఆయుర్వేద వైద్యాల్లో విశేష ప్రాధాన్యత ఉంది. పాలు మాత్రమే కాకుండా, పేడ, మూత్రానికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆరోగ్యానికి మేలు చేస్తాయనే నమ్మకంతో ఈ ఉత్పత్తులను సేకరిస్తారు. మార్కెట్‌లో ఒక్కో పుంగనూరు ఆవు ధర రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఉంటూ, ఇవి అత్యంత ఖరీదైన దేశీయ జాతుల్లో ఒకటిగా నిలుస్తున్నాయి. చంద్రబాబు కుటుంబం ఇలాంటి పవిత్రమైన, సంప్రదాయంగా విలువైన పుంగనూరు ఆవులను గృహప్రవేశానికి తీసుకురావడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది.