Pulivendula Satish Reddy: వైఎస్సార్ సీపీలో ఏదో జరుగుతోంది. ఆ పార్టీ కీలక నేత, ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కొన్నాళ్లుగా సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. తాడేపల్లిలో జరిగే సమావేశాల్లో, జగన్ పాల్గొనే కార్యక్రమాల్లోనూ ఆయన కనిపించడం లేదు. మరోవైపు వైఎస్ జగన్ పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారు. ఇందులో భాగంగా మరో నేతకు కీలక బాధ్యతలను అప్పగించేందుకు జగన్ రెడీ అయ్యారట. వైఎస్ జగన్‌తో వైఎస్సార్ సీపీ నేతల సమన్వయ బాధ్యతలను పులివెందుల సతీశ్ రెడ్డికి అప్పగిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే సమయంలో సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇతరత్రా పార్టీ బాధ్యతలను చూడటం కంటిన్యూ చేస్తారని తెలుస్తోంది.
వచ్చే వారం కీలక భేటీ
వచ్చే వారం తాడేపల్లిలో సతీశ్ రెడ్డి(Pulivendula Satish Reddy), సజ్జలతో జగన్ సమావేశం అవుతారట. వివిధ జిల్లాలకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుల నియామకం ఇంకా పెండింగ్ దశలోనే ఉంది. వాటి భర్తీపై జగన్ ఫోకస్ పెట్టబోతున్నారు. పార్టీ ముఖ్య నేతల పదవుల్లోనూ మార్పులు చేయబోతున్నారు. ఈ అంశాలపై సతీశ్ రెడ్డి, సజ్జలతో జగన్ డిస్కస్ చేస్తారని సమాచారం. ఇద్దరూ కలిసి ఆ అంశాలపై సమన్వయంతో పనిచేయాలని జగన్ దిశా నిర్దేశం చేస్తారట.
Also Read :Nuclear Submarine Base: చైనాకు చెక్.. ఏపీలో అణు జలాంతర్గామి స్థావరం
విజయసాయిరెడ్డి ఆరోపణలపై సమీక్ష..
వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నంత వరకు నంబర్ 2 స్థానంలో విజయసాయిరెడ్డి ఉండేవారు. ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. పార్టీని వీడే క్రమంలో సజ్జల, సుబ్బారెడ్డి కోటరీపై విజయసాయి చేసిన పరోక్ష ఆరోపణలపై జగన్ సమీక్ష నిర్వహించారట. వైఎస్సార్ సీపీని బలహీనపర్చేలా వ్యవహరించే నేతలను పక్కన పెడతామని ఆయన అల్టిమేటం ఇచ్చారట. ఈక్రమంలోనే పులివెందుల సతీశ్ రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నారట. పార్టీ వ్యవహారాలన్నీ ఇక పారదర్శకంగా సాగాలని జగన్ కోరుకుంటున్నారట. మొత్తం మీద ఈ పరిణామంతో లబ్ధి పొందబోయేది సతీశ్ రెడ్డి. ఈయన 2024 సంవత్సరం మార్చి 1న వైఎస్సార్ సీపీలో చేరారు. టీడీపీలో సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. టీడీపీ నుంచి పులివెందుల అసెంబ్లీ టికెట్‌ను ఆశించి సతీశ్ భంగపడ్డారు. దీంతో వైఎస్సార్ సీపీలో చేరారు.