Site icon HashtagU Telugu

Professor Shanthamma : జేడీ వాన్స్, ఉష దంపతులకు శాంతమ్మ అభినందనలు.. ఈమె ఎవరు ?

Professor Shanthamma Usha Chilukuri jd Vance Us Vice President Shanthamma Grand Daughter

Professor Shanthamma : కాసేపట్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈసందర్భంగా 96 ఏళ్ల ప్రొఫెసర్ శాంతమ్మ స్పందించారు. తనకు వరుసకు మనవరాలు అయ్యే జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరికి అభినందనలు తెలిపారు. ‘‘అత్యున్నత స్థానాన్ని అందుకోబోతున్న జేడీ వాన్స్, ఉషకు  నా తరఫున శుభాకాంక్షలు. మీకు, మీ దేశానికి, నా దేశానికి ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ఆమె పేర్కొన్నారు. ‘‘మా బంధువులు అమెరికాలో వివిధ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఉష దంపతులు ఈ స్థాయికి వెళ్లారని తెలియగానే సంతోషంగా అనిపించింది’’ అని శాంతమ్మ(Professor Shanthamma) తెలిపారు. ‘‘త్వరలోనే ఉషను విశాఖకు ఆహ్వానిస్తాం. ఈమధ్య కాలంలో మతమార్పిడులు ఎక్కువయ్యాయి. హిందువుల సంరక్షణకు, హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని ఉషకు నా తరఫున సందేశమిస్తా’’ అని ఆమె చెప్పుకొచ్చారు.

Also Read :Trump : ట్రంప్ విజయోత్సవ ర్యాలీ.. మూడో ప్రపంచ యుద్ధం, టిక్‌టాక్‌లపై కీలక వ్యాఖ్యలు

ప్రొఫెసర్ శాంతమ్మ  ఎవరు ?

ఉషా చిలుకూరికి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో బంధువులు ఉన్నారు.  ప్రొఫెసర్ శాంతమ్మ  భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి.  తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయన కొన్నేళ్ల క్రితం చనిపోయారు. సుబ్రహ్మణ్యశాస్త్రి సోదరుడు రామశాస్త్రి.  రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ. రాధాకృష్ణ సంతానమే ఉషా చిలుకూరి. ఉషా తండ్రి కుటుంబం చాలా ఏళ్ల క్రితమే అమెరికాకు వెళ్లిపోయి అక్కడే స్థిరపడింది. ఉష తండ్రి రాధాకృష్ణ ఏరో నాటికల్‌ ఇంజినీరింగ్‌ చేశారు. ప్రస్తుతం శాన్‌డియాగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ఆయన పామర్రుకు చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నారు.

Also Read :Donald Trump Swearing In : కాసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. ప్రమాణ స్వీకారోత్సవం జరిగేది ఇలా

ఏడాది క్రితం వరకు..

ఉషకు నాన్నమ్మ వరుసయ్యే ప్రొఫెసర్ శాంతమ్మ ఇంకా విశాఖపట్నంలోనే నివసిస్తున్నారు. శాంతమ్మ ఏడాది క్రితం వరకు విద్యార్థులకు పాఠాలు చెప్పారు.  విశాఖ నుంచి రోజూ విజయనగరంలోని సెంచూరియన్‌ విశ్వవిద్యాలయానికి వెళ్లి బోధించేవారు. ప్రస్తుతం ఆమె పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేయాలని భావిస్తున్నారు. ఆమెకు టీచింగ్ అంటే అంతగా ఇష్టం.