School Principal : వాడు ఉపాధ్యాయుడు కాదు కామాంధుడు

School Principal : విద్యా కేంద్రంగా గుర్తింపు పొందిన స్కూల్‌నే దుర్మార్గానికి వేదికగా మార్చిన ప్రిన్సిపాల్ షాజి జయరాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు

Published By: HashtagU Telugu Desk
Private School Principal Im

Private School Principal Im

రాయవరం మండలంలోని మాచవరం గ్రామంలో చోటుచేసుకున్న లైంగిక దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. విద్యా కేంద్రంగా గుర్తింపు పొందిన స్కూల్‌నే దుర్మార్గానికి వేదికగా మార్చిన ప్రిన్సిపాల్ షాజి జయరాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఉపాధ్యాయుడిగా కాకుండా కామాంధుడిగా ప్రవర్తించిన ఆయన, తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తండ్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తి దురాశతో బాలిక జీవితాన్ని నాశనం చేయడం సమాజాన్ని తలదించుకునేలా చేసింది.

తరచూ తన ఛాంబర్‌కి పిలిపించుకుంటూ మొదట మాయమాటలు చెప్పిన ప్రిన్సిపాల్.. అనంతరం భయాందోళన కలిగేలా బెదిరించి లైంగిక దాడులకు పాల్పడ్డాడు. నాలుగు నెలల క్రితం మొదటిసారి అత్యాచారానికి పాల్పడిన అనంతరం అదే పద్ధతిలో మరల దాడులు కొనసాగించినట్లు బాధిత బాలిక వెల్లడించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానని బెదిరించడం వల్ల ఆమె ఆత్మవంచనతో మౌనంగా ఉండిపోయింది.

Pawan – Praksh Raj : పవన్ కళ్యాణ్ ను వదలని ప్రకాష్ రాజ్..ఈసారి ఎలా ట్వీట్ చేసాడో తెలుసా..?

అయితే బాలిక ఆరోగ్య పరిస్థితిలో మార్పులు కనిపించడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆమెకు గర్భం వచ్చిందని తేల్చడంతో తల్లిదండ్రులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. వారు నిలదీసిన తర్వాతే బాలిక అసలు విషయం వెల్లడించింది. స్కూల్ ప్రిన్సిపాల్ చేసిన అఘాయిత్యం తెలిసిన వెంటనే వారు రాయవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం పోలీసులు నిందితుడు షాజి జయరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయం నెలకొంది. పాఠశాలలు భద్రత కల్పించే దేవాలయాలుగా ఉండాల్సిన సమయంలో, అలాంటి చోటే విద్యార్థినులపై దాడులు జరుగడం పట్ల సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బాధిత బాలికకు న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, బాలల హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

  Last Updated: 30 Jul 2025, 11:43 AM IST