Vizag Steel Plant : స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు. నిన్నటి క్యాబినెట్ సమావేశంలో ప్లాంట్ ఈక్విటీ మద్దతు కింద రూ.10,000 కోట్లు ప్యాకేజీ ఇచ్చేందుకు నిర్ణయించాం. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో ఉక్కు రంగ ప్రాముఖ్యతను ఇది వెల్లడిస్తోందని ప్రధాని తెలిపారు. ఆత్మ నిర్భర భారత్ ను సాధించడంలో ఉక్కు రంగానికి ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ఈ చర్య చేపట్టామని వివరించారు.
మరోవైపు ఈ విషయం పై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..ఈ రోజు ఉక్కుతో చెక్కిన ఒక చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుందంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కేంద్రం యొక్క స్థిరమైన ప్రయత్నాలకు ప్రతిస్పందనగా వైజాగ్ స్లీట్ ప్లాంట్ కు రూ.11140 కోట్లు కేటాయించారని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. దీనిపై గౌరవ ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఉక్కు కర్మాగారానికి తన అచంచలమైన మద్దతు కోసం మోడీతో పాటు తాను హామీ ఇస్తున్నానన్నారు. వికసిత్ భారత్ -వికసిత్ ఆంధ్రలో భాగంగా దేశ నిర్మాణానికి సంబంధించిన ప్రధాన మంత్రి దూరదృష్టికి ఇది దోహదపడుతుందని హామీ ఇస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. అలాగే ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి మద్దతుకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
Read Also: Gold Price : రూ.18కే తులం బంగారం..నిజామా..?