PM Modi : అమరావతిలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆరంభానికి సమయం దగ్గరపడింది. కేరళ నుంచి విజయవాడ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని మోడీకి సీఎం చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు వచ్చారు. వేదికపై వచ్చినప్పుడు ప్రధాన మోడీకి ఏపీ గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధర్మవరం శాలువా కప్పి, అనంతరం ప్రత్యేక జ్ఞాపికను ఆయనకు బహుకరించారు. అమరావతి కి ప్రధాని మోడీ ఎంత అండగా ఉన్నారో చూపించే ఫోటోలను ఆయనకు ఇచ్చారు. సభా వేదికపై చంద్రబాబు, మోడీ పలు అంశాలపై సీరియస్ గా చర్చిస్తూ కనిపించారు.
Read Also: National Herald case : సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ
కాగా, ప్రధాని పర్యటనకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 6 వేల మందికి పైగా పోలీస్ బలగాలను మోహరించారు. ఈ బాధ్యత రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు అప్పగించింది. జన సమీకరణ కోసం 4,500 ఆర్టీసీ బస్సులను కేటాయించింది. భద్రతను పర్యవేక్షించేందుకు 19 మంది ఐపీఎస్ అధికారులను నియమించారు. అమరావతిలోని సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 11 మార్గా లను ఖరారు చేశారు. వాటిలో రెండు మార్గాలను ప్రముఖులకు కేటాయించారు. సభా ప్రాంగణం పరిసరాలను ఎన్‌ఎస్‌జీ కమెండోలు ఆ దీనంలోకి తీసుకున్నారు. సభ కోసం 5 లక్షల మందిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ పలు కేంద్ర ప్రాజెక్ట్ లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దీనిలో భాగంగా 18 ప్రాజెక్ట్ లకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 4.55 గంటలకు గన్న వరం చేరుకొని తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.
Read Also: Amaravati Relaunch : మోడీని ఘనంగా సన్మానించిన చంద్రబాబు , పవన్