విశాఖపట్నం రైల్వే జోన్ (Visakha Railway Zone) ఏర్పాటుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈ నెల 8న శంకుస్థాపన చేయనున్నారు. విశాఖపట్నం నగరంలోని సంపత్ వినాయక ఆలయం నుంచి AU ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు రోడ్ షో కూడా నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాక, దేశానికి కూడా కీలకంగా ఉండనుందని రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు.
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులకు మరింత ఊతం కలిగించేందుకు అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలో రైల్వే జోన్‌తో పాటు, పూడిమడకలోని NTPC ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ వంటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు కూడా ఈ పర్యటనలో చోటుచేసుకోనున్నాయి.
JC Prabhakar Reddy : మాధవీలత ప్రాస్టిట్యూట్.. జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రైల్వే జోన్ ఏర్పాటుతో విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాలకు రవాణా సదుపాయాలు మెరుగుపడనున్నాయి. దీని ద్వారా కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రావడంతోపాటు, పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం కానుంది. రైల్వే జోన్ కోసం ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తుండగా..ఇప్పుడు ఈ శంకుస్థాపన వార్త వారిలో ఆనందం నింపుతుంది. ఇక మోడీ పర్యటన సందర్బంగా విశాఖలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ప్రధాని రోడ్ షో నిర్వహించే మార్గంలో భారీ భద్రతా బలగాలను మోహరించారు. ఈ పర్యటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు సమాచారం. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు.
ఇదిలా ఉంటె సీఎం చంద్రబాబు ఈ నెల 4న విశాఖ రానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుని ఆర్కేబీచ్‌లో తూర్పు నౌకాదళం విన్యాసాలు తిలకిస్తారు. సాయంత్రం 6.45 గంటలకు నేవీ అధికారులు ఇచ్చే విందుకు హాజరవుతారు. అదే రోజు విమానంలో విజయవాడకు తిరుగు పయనమవుతారు.
Telugu Maha Sabhalu : నేటి నుంచి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు