AP : చంద్రబాబు తో మరోసారి ప్రశాంత్ కిషోర్ భేటీ…

  • Written By:
  • Publish Date - March 2, 2024 / 02:53 PM IST

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో మరోసారి ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దాదాపు 4 గంటల పాటు ఇద్దరు సమావేశమయ్యారు. గతంలో ప్రశాంత్ కిషోర్ పైన విమర్శలు చేసిన టీడీపీ..ఇప్పుడు ఆయన సలహాలు తీసుకోవటం పైన వైసీపీ నేతలు కార్నర్ చేస్తున్నారు. మిగతా అభ్యర్థుల జాబితా, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల నుంచి వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పీకే వ్యవహరించగా..ఈసారి పీకే సలహాలు లేకుండానే వైసీపీ బరిలోకి దిగుతుంది. టీడిపి మాత్రం పీకే సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక చంద్రబాబు నేడు నెల్లూరు లో పర్యటిస్తున్నారు. రా కదలిరా సభ కోసం నెల్లూరు వచ్చారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో వీరంతా పార్టీ కండువా కప్పుకున్నారు. రాజకీయాల్లో అజాతశత్రువు వంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని కొనియాడారు. ప్రజాసేవకు మారు పేరు వేమిరెడ్డి… ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక ఉద్దేశంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అని తెలిపారు. ఆయన రాకతో నెల్లూరులో సునాయాసంగా గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు కార్పొరేషన్ మొత్తం ఖాళీ అయిపోతుందని అన్నారు. పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామని బాబు చెప్పుకొచ్చారు.

Read Also : Malla Reddy: అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారా..? : మల్లారెడ్డి