Tirumala Laddu Issue : పవన్… నా ట్వీట్ మరోసారి చదివి మాట్లాడు – ప్రకాష్ రాజ్ కౌంటర్

Tirumala Laddu Issue : నేను చెప్పింది ఏంటి.. మీరు అర్థం చేసుకుందేంటీ పవన్ కళ్యాణ్. మీరు తప్పుగా అపార్థం చేసుకొని తిప్పుతున్నది ఏంటని సెటైర్ లు వేశారు

Published By: HashtagU Telugu Desk
Prakash Counter Pawan

Prakash Counter Pawan

Prakash Raj Counter to Pawan Kalyan : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం (Tirumala Laddu Controversy) ఫై చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. యావత్ హిందువులు ఎంతో పవిత్రంగా భవించే లడ్డు..గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అపవిత్రమైంది. ఈ తప్పును సరిద్దికోవాలని ..ప్రతి ఒక్కరు కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి కి పూజలు చేస్తున్నారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఈ రోజు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ మెట్లను శుభ్ర పరిచారు. ఆ తర్వాత లడ్డూ విషయంలో చులకనగా మాట్లాడిన వారిపై మండిపడ్డారు. ప్రకాశ్ రాజ్, పొన్నవోలు సుధాకర్, కార్తీ చేసిన వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ తప్పు పట్టారు.

తిరుమల లడ్డూ కల్తీ అయిందని తాము ఆవేదన చెందుతూ పోరాటం చేస్తుంటే మధ్యలో నీకు ఏంటి ప్రకాష్ రాజ్ (Prakash Raj ) ..? అసలు నీకు ఏం సంబంధం అంటూ నిలదీశాడు. అసలు తిరుపతి లడ్డూ విషయంలో నీకు సంబంధం ఏంటి? నువ్వు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నావ్ అని నిలదీశాడు. వ్యక్తిగా నీ మీద నాకు చాలా గౌరవం ఉంది.. అది నీకు కూడా తెలుసు.. కానీ ఇలా మాట్లాడి దాన్ని తగ్గించుకోకు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ కౌంటర్ (Prakash Raj Counter) వేసాడు. నేను చెప్పింది ఏంటి.. మీరు అర్థం చేసుకుందేంటీ పవన్ కళ్యాణ్. మీరు తప్పుగా అపార్థం చేసుకొని తిప్పుతున్నది ఏంటని సెటైర్ లు వేశారు. ప్రస్తుతం తాను.. విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని .. ఈనెల చివరను 30 తారీఖున వరకు వస్తానని .. ఆ తర్వాత ప్రతి మాటకు సమాధానం చెప్తానని … ఇంతలోపు వీలైతే నా ట్వీట్ ని మళ్లీ ఒకసారి చదివి అర్థం చేసుకోండని ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ స్పందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also : Irani Cup 2024: అయ్యర్‌కి బీసీసీఐ చివరి అవకాశం

  Last Updated: 24 Sep 2024, 03:51 PM IST