Site icon HashtagU Telugu

Pawan Kalyan : పవన్ ‘జనసేనాని’ కాదు ‘భజన’ సేనాని – ప్రకాశ్ రాజ్

Pawan Janasena Comments

Pawan Janasena Comments

నిన్న రాత్రి జరిగిన జనసేన జయకేతనం (Janasena Formation Day) సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు, రాజకీయ విశ్లేషకుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) వ్యంగ్యంగా స్పందించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా “పవన్ గెలవక ముందు ‘జనసేనాని’, గెలిచిన తర్వాత ‘భజన సేనాని’… అంతేనా?” అంటూ ప్రశ్నించారు. పవన్ గతంలో హిందీ భాషపై చేసిన విమర్శలను గుర్తు చేస్తూ ఇప్పుడు ఆయన విధానాల్లో వచ్చిన మార్పును ఎత్తిచూపారు.

Virat Kohli: టీ20 రిటైర్మెంట్‌పై విరాట్‌ కోహ్లీ యూ ట‌ర్న్‌.. కార‌ణ‌మిదే?

ప్రకాశ్ రాజ్ తన ట్వీట్‌లో పవన్ కళ్యాణ్ గతంలో హిందీ భాషా పాదర్ప్యంపై తీసుకున్న వైఖరికి వ్యతిరేకంగా ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలపై నిలదీశారు. ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాలకు మద్దతుగా హిందీ భాషా విధానాలను వ్యతిరేకిస్తూ పవన్ కాలంలో చేసిన సోషల్ మీడియా పోస్టులను ఆయన ట్వీట్‌కు జత చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా అనుసరిస్తున్న మార్గం, ఆయన మద్దతుదారులు, రాజకీయ ప్రత్యర్థుల మధ్య తీవ్ర చర్చకు దారి తీసింది.

ఈ వ్యాఖ్యలపై జనసేన వర్గాలు ఇప్పటివరకు అధికారికంగా స్పందించకపోయినా, పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. మరోవైపు ప్రకాశ్ రాజ్ గతంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజకీయాలు, సినిమా రంగంలో తన అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటిస్తూ ఉంటారు.

CM Revanth : గుడ్డలూడదీసి కొడతాం.. ఫేక్ జర్నలిస్టులకు సీఎం వార్నింగ్

ఇదిలా ఉంటె తాను హిందీ భాషను ఎప్పుడూ వ్యతిరేకించలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దాన్ని నిర్బంధంగా అమలు చేయడాన్నే వ్యతిరేకించానని ట్వీట్ చేశారు. NEP-2020 హిందీని కంపల్సరీ చేయాలని చెప్పలేదని, కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఆ పాలసీ ప్రకారం మాతృభాష, మరో భారతీయ భాష, ఒక అంతర్జాతీయ భాష నేర్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. హిందీని చదవడం ఇష్టం లేకపోతే మిగతా భాషలు నేర్చుకోవచ్చన్నారు.