అల్ప పీడన ప్రభావం తో గత మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో (AP & Telangana) విస్తారంగా వర్షాలు (Rains) పడుతున్న సంగతి తెలిసిందే. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి భారీ వర్షాలు పడుతుండడం తో పలు నగరాలు నీట మునిగాయి. ముఖ్యంగా విజయవాడ (Vijayawada) నగరంలో అతలాకుతలం అయ్యింది. ప్రకాశం బ్యారేజీ, బుడమేరు వరద విజయవాడను అల్లకల్లోలం చేసింది. ఇప్పటికే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడి ఆరుగురు, వరదలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. సింగ్నగర్, జక్కంపూడి, అంబాపురం, వైఎస్సార్ కాలనీలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ-కొండపల్లి రైల్వే ట్రాక్ పూర్తిగా మునిగిపోయింది.
We’re now on WhatsApp. Click to Join.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణ నది పొంగి పొర్లుతుంది. ఈ నదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల, కృష్ణ బ్యారేజీ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణ బ్యారేజీ (Prakasam Barrage)కి ఒక్కసారిగా వరద పోటెత్తింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. దీంతో బ్యారేజీ 70 గేట్లను ఎత్తిన అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లే సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యారేజ్ లో ఉండే పలు పడవల లాక్ లు తెగిపోవడంతో అవన్నీ బ్యారేజ్ గేట్ల వైపు వచ్చాయి. వీటిలో పలు పడవలు బలంగా బ్యారేజ్ గేట్లకు తగలడంతో మూడు గేట్లు డ్యామేజ్ అయినట్లు సమాచారం అందుతుంది. బ్యారేజ్ గేట్లకు పడవలు అడ్డుపడ్డ విషయాన్ని గమనించిన అధికారులు వాటికీ పక్కకు తొలగించారు. కానీ పడవలు ఢీ కొన్న గేట్లకు పగుళ్లు రావడం తో పెను ప్రమాదమేమైనా పొంచి ఉందా అని భయపడుతున్నారు. ప్రస్తుతమైతే బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తుంది.
Read Also : Helicopter Crash : ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ క్రాష్.. కారణం అదే
