Prabhas Fan Kills PK Fan: పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ.. పవన్ అభిమాని మృతి

ఏలూరుకు చెందిన హరికుమార్, కిషోర్ పెయింటర్లు. హరికుమార్ ప్రభాస్ (Prabhas) అభిమాని కాగా, కిషోర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమాని.

Published By: HashtagU Telugu Desk
Son Killed Father

Crime Scene

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో ఇద్దరు అభిమానుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణాలు తీసింది. ఏలూరుకు చెందిన హరికుమార్, కిషోర్ పెయింటర్లు. హరికుమార్ ప్రభాస్ (Prabhas) అభిమాని కాగా, కిషోర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమాని. హరికుమార్ ప్రభాస్ ఫొటోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడంతో.. పవన్‌ కల్యాణ్ ఫొటో పెట్టుకోవాలని కిషోర్ కోరాడు. అందుకు నిరాకరించిన హరికుమార్ క్షణికావేశంలో సెంట్రింగ్ కర్రతో కిషోర్‌పై దాడి చేయడంతో మృతిచెందాడు.

Also Read: Gold Price Today: దేశ వ్యాప్తంగా నేటి బంగారం, వెండి ధరలివే.. తగ్గిన ధరలు..!

ప్రభాస్ అభిమాని అయిన హరికుమార్ ఏలూరులో ప్రభాస్ అభిమానుల సంఘానికి కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన వాట్సాప్ స్టేటస్‌గా ప్రభాస్ వీడియోను పెట్టుకున్నాడు. పవన్ కల్యాణ్ అభిమాని అయిన కిషోర్ అది చూసి ప్రభాస్ వీడియోలు కాకుండా పవన్ వీడియోలు పెట్టుకోవాలని సూచించారు. ఇది ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. అప్పటికే ఇద్దరూ మద్యం మత్తులో ఉండడంతో మాటామాటా పెరిగింది. కోపంతో ఊగిపోయిన హరికుమార్ సెంట్రింగ్ కర్రతో కిషోర్ తలపై దాడిచేశాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న రాయితో ముఖంపై మోదడంతో కిషోర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హరికుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  Last Updated: 23 Apr 2023, 10:34 AM IST