Site icon HashtagU Telugu

Shyamala Devi : జనసేన, బీజేపీ తరపున ప్రచారం చేస్తున్న ప్రభాస్ పెద్దమ్మ.. నరసాపురంలో గెలుపు పక్కా..

Prabhas Aunt Shyamala Devi Participated in Election Campaign

Prabhas Aunt Shyamala Devi Participated in Election Campaign

Shyamala Devi : రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు(Elections) జరుగుతున్నాయి. మరో అయిదు రోజులే ఉండటంతో ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు సినీ సెలబ్రిటీలని దింపుతున్నారు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కూటమి ఇటీవల వరుసగా సినీ, టీవీ సెలబ్రిటీలను ప్రచారంలో దింపారు. ఇప్పటికే జనసేన(Janasena), టీడీపీ(TDP) తరపున అనేకమంది సినీ, టీవీ ప్రముఖులు వచ్చి ప్రచారం చేశారు.

తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రభాస్, దివంగత కృష్ణంరాజులకు భీమవరం, నరసాపురం, ఆ చుట్టు పక్క ఊళ్ళల్లో బాగా పేరు ఉంది, అభిమానులు భారీగా ఉన్నారు. దీంతో నేడు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి నరసాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి తరపున పాల్గొన్నారు.

కూటమి పార్టీల ఆధ్వర్యంలో నరసాపురం నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో శ్యామలాదేవి పాల్గొని నరసాపురం నియోజకవర్గ ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ నేత భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు, అలాగే నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన నేత బొమ్మిడి నాయకర్ లకు సపోర్ట్ చేస్తూ ప్రచారం చేశారు. గోదావరి జిల్లాల్లో కూటమి ఎక్కువ సీట్లు గెలుస్తుందని అంతా భావిస్తున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్న ప్లేస్ లో ప్రభాస్ పెద్దమ్మతో ప్రచారం చేయించడం, కృష్ణంరాజు గతంలో బీజేపీ పార్టీలో ఉన్నది గుర్తుచేయడంతో నరసాపురం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కూటమికే వస్తాయని ఆ ప్రాంతాల్లో భావిస్తున్నారు.

 

Also Read : Rana Daggubati : ఎన్నికల ముందు చంద్రబాబుని, గల్లా జయదేవ్‌ని పొగిడిన రానా..