Pothole Free Roads In AP : జగన్ ప్రభుత్వ హయాంలో రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేవో చెప్పాల్సిన పనిలేదు. ఏపీ రోడ్లపై ప్రయాణం అంటే ప్రాణాల మీద ఆశలు వదులుకొని ప్రయాణం చేసే వాళ్ళు..ఎటుచుసిన గుంతలతో రోడ్లు కనిపించేవి. రోడ్లు బాగుచేయాలని ఐదేళ్ల పాటు ప్రజలు మొరపెట్టుకున్నా జగన్ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ గుంతల రోడ్లకు మోక్షం కల్పించారు సీఎం చంద్రబాబు (CHandrababu). నేడు ‘గుంతల రహిత రోడ్లు’ (Pothole Free Roads In AP) కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని రోడ్లు నరకానికి రహదారులుగా మారాయని, ఈ దుస్థితికి గత పాలకుడే కారణమని విమర్శించారు. రోడ్లపై ఈత కొలనులు ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. రహదారులు బాగుంటే పరిశ్రమలు వస్తాయని అన్నారు. సంక్రాంతిలోపు రోడ్లపై ఒక్క గుంత కూడా ఉండొద్దని అధికారులను ఆదేశించారు.
ప్రధాన రహదారులను, గ్రామీణ మార్గాలను పునరుద్ధరించి వాటిలో గుంతలు లేకుండా చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. రహదారుల్లో ఎక్కడైనా గుంతలు ఏర్పడితే, వాటిని తక్షణమే రిపేర్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసిందని సర్కార్. ముఖ్య నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల మధ్య అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారులు ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా ప్రాధాన్యం పొందుతున్నాయి. ప్రజల నుండి ఫీడ్‌బ్యాక్ తీసుకుని రహదారి పరిస్థితిని అంచనా వేసేందుకు మరియు తక్షణ చర్యలు తీసుకోవడంలో అధికారులు చురుకుగా వ్యవహరిస్తున్నారు.
పాలకొల్లు నియోజకవర్గంలో గుంతల రహిత కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు-దొడ్డిపట్ల రహదారి మరమత్తు పనులను మంత్రి నిమ్మల ప్రారంభించారు. వచ్చే సంక్రాంతి నాటికి 600 కోట్లతో గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
Read Also : Pushpa 2 Special Song : పుష్ప 2లో స్పెషల్ సాంగ్ హీరోయిన్ ఫిక్స్.. రచ్చ రంబోలా గ్యారెంటీ..?