Site icon HashtagU Telugu

AP : విజయవాడ పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా పోతిన మహేష్‌..?

Pothani Ycp Vjd

Pothani Ycp Vjd

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న టైం లో అధికార పార్టీ వైసీపీ (YCP)..కొన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ , పార్లమెంట్ అభ్యర్థులను మార్చబోతుందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసీపీ..ఈసారి కూడా రిపీట్ చేయాలనే ఆలోచనతో కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేయించి స్థానిక ఎమ్మెల్యే ఫై ప్రజలు ఏమనుకుంటున్నారు..? మరోసారి వారికీ టికెట్ ఇస్తే ప్రజలు మద్దతు ఇస్తారా..లేదా..? అనేదానిపై సర్వే చేయించి దాని ప్రకారం టికెట్లు కేటాయించారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలకు ఈసారి టికెట్ ఇవ్వలేదు. అలాగే పలువురుని మార్చడం వంటివి చేసారు. ఇవన్నీ చేసిన తర్వాత అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఇప్పుడు కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చబోతుందని అంటున్నారు.

ప్రత్యర్థి పార్టీలు సైతం తమ అభ్యర్థులను ప్రకటించడం తో..ఆ స్థానాల్లో ఆయా నేతల బలం ఎక్కువగా ఉండడం తో ఆ స్థానాల్లో ఇంకాస్త బలమైన నేతను బరిలోకి దింపాలని జగన్ చూస్తున్నాడట. ఇందుకోసం పలు మార్పులు చేస్తున్నారని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. మైలవరం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా జోగి రమేష్‌ను నియమించబోతున్నారట. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరడంతో ఇక్కడి నుంచి సర్నాల తిరుపతిరావును అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. ఆయన బదులు జోగి రమేష్‌కు ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారట. అలాగే విజయవాడ పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా పోతిన మహేష్‌ను నియమిస్తారని టాక్ వినిపిస్తోంది. ఆయన బుధవారమే జనసేన పార్టీని వీడి వైసీపీ లో చేరారు. ఇక్కడ ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా షేక్‌ ఆసిఫ్‌ ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే గుంటూరు వైసీపీ ఎంపీగా విడదల రజినీని.. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా కిలారు రోశయ్యను మార్చే అవకాశం ఉందంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో విప్పర్తి వేణుగోపాల్ బదులు.. పాముల రాజేశ్వరికి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారట. అవనిగడ్డ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ బదులు సింహాద్రి చంద్రశేఖర్‌ను నియమించబోతున్నారట. చిలకలూరిపేటలో కావటి మనోహర్ నాయుడు బదులు మర్రి రాజశేఖర్‌ను , రాయచోటిలో గడికొట శ్రీకాంత్ రెడ్డి బదులు.. రమేష్ కుమార్‌ రెడ్డిని, కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డికి బదులుగా అభిషేక్ రెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థి గా బీవై రామయ్య బదులు కేఈ ప్రభాకర్ ను నియమించాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై వైసీపీ అధికారిక ప్రకటన చేయనప్పటికీ సోషల్ మీడియా లో మాత్రం తెగ చక్కర్లు కొడుతున్నాయి. నిజంగా వైసీపీ అధిష్టానం మార్చబోతుందా..? లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Read Also : Janasena : జనసేన కోసం ప్రచారం చేస్తా అంటున్న యంగ్ హీరో