Postmortem of BJP : తెలుగు రాష్ట్రాల బీజేపీ ప్ర‌క్షాళ‌న‌, కేంద్ర మంత్రివ‌ర్గం మార్పులు?

కేంద్ర మంత్రివ‌ర్గం విస్త‌ర‌ణ (Postmortem of BJP) హ‌డావుడి కనిపిస్తోంది.తెలుగు రాష్ట్రాల‌కు ప్రాధాన్యం ఇచ్చేలా విస్త‌ర‌ణ ఉంటుంద‌ని టాక్‌.

  • Written By:
  • Publish Date - June 30, 2023 / 04:19 PM IST

తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రివ‌ర్గం విస్త‌ర‌ణ (Postmortem of BJP) హ‌డావుడి కనిపిస్తోంది. ఈసారి రెండు రాష్ట్రాల‌కు ప్రాధాన్యం ఇచ్చేలా ప్ర‌ధాని మోడీ క్యాబినెట్ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని టాక్‌. జూలై మూడో తేదీన కీల‌క స‌మావేశాన్ని మోడీ నిర్వ‌హించ‌బోతున్నారు. ఆ రోజున తీసుకునే నిర్ణ‌యంపై ఏపీ, తెలంగాణ బీజేపీ నేత‌ల భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంది. ఇప్ప‌టికే బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ కు కేంద్ర మంత్రి ప‌ద‌వి ద‌క్కే ఛాన్స్ ఉంద‌ని ప్ర‌చారం విస్తృతంగా జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం తెలంగాణ బీజేపీకి అనూహ్య చికిత్స చేయ‌డానికి మోడీ రంగంలోకి దిగుతున్నార‌ని తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రివ‌ర్గం విస్త‌ర‌ణ హ‌డావుడి(Postmortem of BJP) 

తెలంగాణ‌కు జూలై 8న న‌రేంద్ర‌మోడీ రాబోతున్నారు. ఆ లోపుగా తెలంగాణ బీజేపీ ప్ర‌క్షాళ‌న (Postmortem of BJP) జ‌రుగుతుంద‌ని ఢిల్లీ వ‌ర్గాల టాక్‌. ప్ర‌స్తుతం బీజేపీలో అసంతృప్తిగా ఉన్న వాళ్ల‌ను వ‌దిలించుకోవ‌డంతో పాటు కొత్త వాళ్ల‌ను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తోంది. ఆ క్ర‌మంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిష‌న్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని అధిష్టానం యోచిస్తోంద‌ని ప్ర‌చారం జరుగుతోంది. కానీ, ఆయ‌న ఇప్ప‌టికే రెండుసార్లు బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించారు. అందుకే, సంఘ్ నేప‌థ్య‌మున్న సీనియ‌ర్ల కోసం అన్వేష‌ణ చేస్తోంది. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వాళ్ల‌కు అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించే సంస్కృతి బీజేపీలో లేదు. పార్టీలోని వాళ్ల‌కు మాత్ర‌మే అవ‌కాశం ఉంటుంది.

రాజ్య‌స‌భ స‌భ్యుల్లో ఎవ‌రో ఒక‌రికి కేంద్ర మంత్రి ప‌ద‌విని కూడా ఏపీకి

ఇక ఏపీలోని బీజేపీ ప‌రిస్థితి ఛిన్నాభిన్నంగా ఉంది. అక్క‌డ సార‌థ్యం బ‌ల‌హీనంగా ఉంద‌ని అధిష్టానం చాలా రోజులుగా భావిస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న వీర్రాజును పార్టీ అధ్య‌క్షుడిగా తొల‌గించాల‌ని చూస్తోంది. రాయ‌ల‌సీమ‌కు చెందిన రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి ఇవ్వ‌డ‌మా? లేక బీసీ, బ్రాహ్మ‌ణ వ‌ర్గానికి అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాలా? అనే దానిపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న.(Postmortem of BJP) జ‌రుగుతోంది. అలాగే, కేంద్ర మంత్రి వ‌ర్గంలో ప్ర‌స్తుతం ఉన్న రాజ్య‌స‌భ స‌భ్యుల్లో ఒక‌ర్ని మంత్రి ప‌ద‌వి వ‌రించే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. అక్క‌డ పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డానికి అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే రెండుసార్లు కాపు సామాజిక‌వ‌ర్గానికి బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. కానీ, పార్టీ బ‌లోపేతం కాలేదు. అందుకే, ఈసారి వెనుక‌బ‌డిన వ‌ర్గాల నుంచి ఎంపిక చేయ‌డానికి ఛాన్స్ ఉంది. అదే స‌మ‌యంలో బీజేపీలోని రాజ్య‌స‌భ స‌భ్యుల్లో ఎవ‌రో ఒక‌రికి కేంద్ర మంత్రి ప‌ద‌విని కూడా ఏపీకి ఇస్తార‌ని తెలుస్తోంది.

ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ముసాయిదా బిల్లు ఈ వర్షాకాల సమావేశంలో పార్లమెంటు ముందుకు

ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ హాలులో జూలై మూడున కేబినెట్ సమావేశం కానుంది. కేంద్ర మంత్రులు, సహాయ, స్వతంత్ర మంత్రులు హాజరు కానున్నారు. లోక్ సభ ఎన్నికలు స‌మీపిస్తోన్న త‌రుణంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై (Postmortem of BJP) ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వ‌చ్చే నెల మూడో వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి మండలి సమావేశ ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ ఏడాది రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జ‌ర‌గాలి. మంత్రి వ‌ర్గ స‌మావేశంలో ఈ ఎన్నిక‌ల‌పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అమెరికా ప‌ర్య‌ట‌న ముగించుకుని వచ్చిన మ‌రుస‌టిరోజే అర్థ‌రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలతో చర్చలు జరిపారు.ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ముసాయిదా బిల్లు ఈ వర్షాకాల సమావేశంలో పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై అభిప్రాయాల సేకర‌ణ‌కు న్యాయ కమిషన్, న్యాయ మంత్రిత్వశాఖతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జులై 3న సమావేశం కానుంది.

Also Read : Differences in BJP : తెలంగాణ బీజేపీలో విభేదాల హోరు!ట్విట్ట‌ర్ వార్ షురూ!!

ఉమ్మడి పౌరస్మృతిని అమలుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం విదిత‌మే. ఒకే దేశంలో రెండు విధానాలు ఉండ‌కూద‌ని మోడీ భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని తెరపైకి తీసుకురావడంపై మోడీ మీద విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిస్తోంది. అయిన‌ప్ప‌టికీ మోడీ ద‌గ్గ‌కుండా నిర్ణ‌యం తీసుకోబోతున్నారు. జూలై 3న క్యాబినెట్ స‌మావేశం ఈ బిల్లును ఆమోదిస్తూ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. ఉమ్మ‌డి పౌర‌స‌త్వం అనే అంశాన్ని బేస్ చేసుకుని వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని బీజేపీ ప‌క్కాగా (Postmortem of BJP) చేస్తోంది. పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశం ముగిసిన వెంట‌నే ఎన్నిక‌ల‌కు వెళ‌తార‌ని కూడా టాక్ ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు లోక్ స‌భ ఎన్నిక‌లు కూడా వస్తాయ‌ని ఢిల్లీలో చ‌క్క‌ర్లు కొడుతోన్న న్యూస్. అదే జ‌రిగితే, మంత్రివ‌ర్గం మార్పులు ఉండ‌వు. మంత్రివ‌ర్గం మార్పులు ఉంటే మాత్రం తెలుగు రాష్ట్రాల‌కు ఈసారి ప్ర‌త్యేక అవ‌కాశాల‌ను మోడీ ఇస్తార‌ని భావిస్తున్నారు.

Also Read : BJP : ఫ్రస్ట్రేషన్‌లో బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం.. సొంత పార్టీ నేత‌ల‌కు బెదిరింపులు.. ?