సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishnamurali)పోలీసుల విచారణకు సహకరించడం లేదని సమాచారం. ఏపీ వ్యాప్తంగా పోసానిపై పలు కేసులు నమోదవ్వడంతో, హైదరాబాద్‌లోని రాయదుర్గం ‘మై హోమ్ భుజా’ అపార్ట్‌మెంట్ వద్ద పోలీసులు బుధువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్, సీఐ వెంకటేశ్వర్లు సంయుక్తంగా నాలుగు గంటలుగా ఆయనను ప్రశ్నించినా, ఎటువంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా కూర్చున్నారని తెలుస్తోంది. ఆయన సమగ్రంగా విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని, ప్రతి ప్రశ్నను దాటవేస్తూ ఉండటంతో పోలీసులు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారని వార్తలు వస్తున్నాయి.
Balakrishna : త్వరలోనే ఎన్టీఆర్‌కు భారతరత్న: బాలకృష్ణ
పోలీసులు ఎన్ని ప్రశ్నలు అడిగినా, పోసాని మౌనం వీడకపోవడం విచారణ ప్రక్రియను మరింత సంక్లిష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన నిజాలను వెల్లడించకపోవడం, విచారణకు సహకరించకపోవడం వెనుక ఎలాంటి కారణాలున్నాయనే విషయంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోసాని నోరు విప్పితేనే విచారణ ముందుకు సాగుతుందని, ఆయన స్పందనపై కేసు పరిణామాలు ఆధారపడుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులో పోసాని వైఖరిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరుపై, విచారణ తీరుపై కూడా ఆయనకు అభ్యంతరాలున్నాయా? లేక వ్యక్తిగత కారణాల వల్ల మౌనం పాటిస్తున్నారా? అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పోసాని విచారణలో సహకరించకుంటే, పోలీసులు మరింత కఠినమైన చర్యలు తీసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Anita Anand: కెనడా ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన మహిళ.. ఎవరీ అనితా ఆనంద్?