Posani Remand : కడప సెంట్రల్ జైల్ కు పోసాని

Posani Remand : పోసానికి రిమాండ్ విధించాలనే వాదనను పోలీసుల తరఫు న్యాయవాది వినిపించారు

Published By: HashtagU Telugu Desk
Posani Krishna Murali Reman

Posani Krishna Murali Reman

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీ ( Posani Krishna Murali )కి 14 రోజుల రిమాండ్ (Remanded for 14 days) విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టైన పోసానిని గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ఆయనను సుమారు 8 గంటల పాటు విచారించి, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రాత్రి 9.30 గంటలకు రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరిచారు.

Hyderabad : HCUలో కుప్పకూలిన బిల్డింగ్

కోర్టులో శుక్రవారం తెల్లవారుజాము 5 గంటల వరకు సుదీర్ఘ వాదనలు జరిగాయి. పోసాని తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. బీఎన్‌ఎస్‌ చట్టం ప్రకారం 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. అయితే పోసానికి రిమాండ్ విధించాలనే వాదనను పోలీసుల తరఫు న్యాయవాది వినిపించారు. ఇరు వైపుల వాదనలు విన్న మేజిస్ట్రేట్, పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో పోసాని కృష్ణ మురళీని కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

Parenting Tips: పిల్ల‌ల‌ను పెంచే విష‌యంలో పొర‌పాటున కూడా ఈ మూడు త‌ప్పులు చేయ‌కండి!

ఇక పోసాని కోసం జగన్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపినప్పుడే చాలా మంది పోసానికి రిమాండ్ ఖాయమనుకున్నారు. పొన్నవోలుకు బదులు కనీసం పోసాని తన సొంత లాయర్ ను పెట్టుకున్నా బాగుండేదని ఆయన శ్రేయోభిలాషులు అనుకుంటున్నారు. జగన్ ప్రతి కేసుకు నిరంజన్ రెడ్డి వస్తూంటారు. ఇతర సీనియర్ నేతలకూ ఆయనే లాయర్. కానీ కిందిస్థాయి నేతలకు మాత్రం పొన్నవోలును పంపిస్తూంటారు. పోసాని కోసం కూడా జగన్ పొన్నవోలు ను పంపించి రిమాండ్ కు వెళ్లేలా చేసాడని అంత మాట్లాడుకుంటున్నారు. మరి పోసాని ఎలా బయటకు వస్తారో చూడాలి.

  Last Updated: 28 Feb 2025, 08:40 AM IST