Site icon HashtagU Telugu

Vizag Harbour Fire Accident: వైజాగ్‌ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదానికి నాని కారణమా ?

Vizag Harbour Fire Accident

Vizag Harbour Fire Accident

Vizag Harbour Fire Accident: వైజాగ్‌లోని ఫిషింగ్ హార్బర్‌లో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఏకంగా 50 నుంచి 60 బోట్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. దాదాపు 40 నుంచి 50 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రాధమిక సమాచారం. అయితే.. ఈ అగ్ని ప్రమాదంలో.. కీలక నిందితుడిగా భావిస్తున్న ప్రముఖ యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఈ ప్రమాదానికి స్థానిక నానీ కారణమంటూ.. సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. నవంబర్ 19న నాని భార్య శ్రీమంతం కార్యక్రమం జరిగింది. రాత్రి పడవలో తన స్నేహితులకు మద్యం పార్టీ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ ముగిసిన తర్వాత అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాన్ని మొత్తం వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాడు నాని. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో వైరల్ కావడంతో నానిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరి సమాచారం మేరకు నాని తన బోటును మరో వ్యక్తికి విక్రయించాడు. బోటు కొన్న వ్యక్తి సగం డబ్బు మాత్రమే ఇచ్చాడని పలువురు అంటున్నారు. ఈ క్రమంలో నాని తన బోటుకు నిప్పంటించడంతో అది మిగతా బోట్లకు అంటుకుని పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. బోట్లలో డీజిల్ డబ్బాలు ఉండడంతో చూస్తుండగానే బోట్లకు మంటలు అంటుకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో హార్బర్‌లో 400 రోయింగ్ బోట్లు ఉన్నాయి. దాదాపు 60 మంది మంటల్లో చిక్కుకున్నారు.ఫైర్ సిబ్బంది, స్థానికులు, బోటు యజమానులు అందరూ కలిసి మంటలను ఆర్పేందుకు యత్నిస్తుండగా.. నాని ప్రమాదాన్ని వీడియో తీస్తూ కనిపించాడు. ఇంత విషాదం జరుగుతుంటే..కళ్ల ముందే జీవనోపాధి కాలిపోతుంటే.. నాని మాత్రం తనకు సంబంధం లేదంటూ వీడియో తీసి తన ఛానల్ లో అప్ లోడ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు మాత్రం కామెంట్ల రూపంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంతో తనకేమీ సంబంధం లేదంటూ వీడియో తీసి స్వార్థం ప్రదర్శించారనే వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులకు అనుమానం రాకుండా నటించేందుకు ప్రయత్నించాడని.. అయితే అసలు కారణం అతనేనని వ్యాఖ్యానిస్తున్నారు.

లోకల్ బాయ్ నాని పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న నానికి 1.65 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉండటం గమనార్హం. బోటులో చేపలు పట్టుకుంటూ.. చేపలకు సంబంధించి రకరకాల వీడియోలు చేస్తూ… నెటిజన్లకు దగ్గరయ్యాడు. ఇదిలా ఉంటే.. ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియోలతో పాటు సినిమా ట్రయల్స్, ఇంటర్వ్యూలు కూడా చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు.

Also Read: Vitamin D Side-Effects : వామ్మో.. శరీరంలో విటమిన్ డి పెరిగితే అంత ప్రమాదమా?

Exit mobile version