సంక్రాంతి (Pongal 2025) పండుగ వేళ, సొంత ఊళ్లకు (Hometowns) వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చదువు, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం హైదరాబాద్ (Hyderabad) వంటి పట్టణాల్లో స్థిరపడిన లక్షలాది మంది సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ పండుగ నేపథ్యంలో రైళ్లు, బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంటుంది. ఫలితంగా, చాలామంది వ్యక్తిగత వాహనాలతో ప్రయాణం చేస్తున్నారు. అయితే, ప్రయాణంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం అత్యంత ముఖ్యమని పోలీసులు, కుటుంబ సభ్యులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణ సమయంలో రాత్రి పూట డ్రైవింగ్ చేయకుండా ఉండటం అత్యంత అవసరం. రహదారులపై పొగమంచు కారణంగా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. వాహనాలను 80 కి.మీ/గం వేగానికి మించకుండా నడపాలి. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఉపయోగించకూడదు. వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి.
అలాగే ఇంట్లో విలువైన వస్తువులు ఉంటే వాటిని భద్రపరచడం మరువకండి. బీరువా తాళాలు, నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను బ్యాంకులో భద్రపరచడం ఉత్తమం. ఇంటికి తాళం వేసినట్లు బయటవారికి కనిపించకుండా కర్టెన్ వేసి తాళాన్ని కప్పివేయాలి. తాళం వేసిన ఇంటిపై దృష్టి పెట్టే దొంగలను నివారించేందుకు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అవసరం. అంతే కాదు మీరు ఊరెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఉండటం కీలకం. ఇంటి ముందు చెత్త శుభ్రం చేయడం లేదా ఇతర పనుల కోసం తెలిసిన వ్యక్తులను ఉంచడం మంచింది. పొరుగు ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే, వెంటనే 100 నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. ఇవే కాకుండా, సంక్రాంతి పండుగను ఆనందంగా గడపడానికి ప్రయాణానికి ముందు వాహనాలను పరిశీలించి సిద్ధం చేసుకోవడం ఉత్తమం. ఇలా ఇవన్నీ తప్పకుండ పాటించండి.