Site icon HashtagU Telugu

X Posts Vs EC : ఈసీ ఆర్డర్.. టీడీపీ, వైఎస్సార్ సీపీల ‘ఎక్స్’ పోస్టులు డిలీట్

Election Notification

Election Commission

X Posts Vs EC : సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు, నాయకులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పెడుతున్న పోస్టులపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఫోకస్ చేసింది. తాజాగా పలు పోస్టులకు సంబంధించి ‘ఎక్స్’ (ట్విట్టర్)‌కు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నాయకులు పెట్టిన నాలుగు పోస్టులను తొలగించాలని ఎక్స్ కు ఆర్డర్ ఇచ్చింది.  ఎన్నికల నోడల్ అధికారుల నుంచి అందిన ఫిర్యాదులకు స్పందనగా ఈసీ ఈమేరకు చర్యలు చేపట్టింది. ఈసీ ఆదేశాలు అందగానే ‘ఎక్స్’ ఆ నాలుగు పోస్టులను డిలీట్ చేసింది. అయితే ఆ పోస్టులు భారత దేశంలో మాత్రమే డిలీట్ అవతాయి. ఇతర ప్రపంచ దేశాలలో యథాతథంగా కనిపిస్తాయి. ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ గా చేసుకుని రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఈసీ నిషేధించిన విషయం తెలిసిందే. అలాంటి పోస్టులను గుర్తించి, డిలీట్ చేయించే పనిని ఇప్పుడు ఎన్నికల సంఘం(X Posts Vs EC) మొదలుపెట్టింది.

Also Read :BJP Only 2 : బీజేపీకి 2 సీట్లే.. ‘సివిక్ పోల్’ సంచలన సర్వే నివేదిక

Also Read :Elephants Attack : తెలంగాణలోని ఆ జిల్లాలో ఏనుగుల దడ