Political Revenge : వదిన మరిది సవాల్ !

తెలుగుదేశం చీఫ్ నారా చంద్ర‌బాబునాయుడు, బీజేపీ ఏపీ చీఫ్ పురంధరేశ్వ‌రికి మ‌ధ్య రాజ‌కీయ(Political revenge )వైరం ద‌శాబ్దాలుగా కొన‌సాగుతోంది.

  • Written By:
  • Updated On - July 8, 2023 / 05:25 PM IST

తెలుగుదేశం చీఫ్ నారా చంద్ర‌బాబునాయుడు, బీజేపీ ఏపీ చీఫ్ పురంధరేశ్వ‌రికి మ‌ధ్య రాజ‌కీయ(Political Revenge )వైరం ద‌శాబ్దాలుగా కొన‌సాగుతోంది. రాజ‌కీయంగా అణ‌గ‌దొక్కాడ‌న్న కోపం చంద్ర‌బాబు మీద దగ్గుబాటి దంప‌తుల్లో అణువ‌ణునా ఉంద‌ని స‌న్నిహితులు చెబుతుంటారు. ఇప్పుడు ఆ క‌సిని తీర్చుకునే అవ‌కాశం పురంధ‌రేశ్వ‌రికి వ‌చ్చింది. ఏపీ లో బీజేపీ బ‌లోపేతం, పొత్తుల అంశాన్ని పూర్తిగా ఆమెకు బీజేపీ అధిష్టానం అప్ప‌గించింది. స్వ‌తంత్ర్యంగా ఏ నిర్ణ‌య‌మైనా తీసుకోవ‌చ్చ‌ని జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా స్వేచ్ఛ‌ను ఇచ్చారని తెలుస్తోంది.

చంద్ర‌బాబునాయుడు, బీజేపీ ఏపీ చీఫ్ పురంధరేశ్వ‌రికి మ‌ధ్య రాజ‌కీయ వైరం(Political Revenge )

మ‌రో రెండు రోజుల్లో అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించ‌బోతున్న ఆమె రాష్ట్ర‌, జిల్లా క‌మిటీల‌ను పూర్తిగా మార్చేస్తార‌ని టాక్‌. ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్నా, సోము వీర్రాజు టీమ్ హ‌వా కొన‌సాగింది. పార్టీ బ‌లోపేతం కోసం సొంత టీమ్ ను త‌యారు చేసుకుంటార‌ని తెలుస్తోంది. స‌ర్గీయ ఎన్టీఆర్ చ‌రిష్మాను పురంధ‌రేశ్వ‌రి సొంత చేసుకునే ఛాన్స్ ఉంది. ఆయ‌న బొమ్మతో ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగుదేశం పార్టీ న‌డుస్తోంది. శ‌తజ‌యంతి ఉత్స‌వాల ద్వారా పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డానికి చంద్ర‌బాబు ప్లాన్ చేశారు. కానీ, ఇప్పుడు పురంధేశ్వ‌రి రూపంలో స్వ‌ర్గీయ ఎన్టీఆర్ చ‌రిష్మా ఎంతో కొంత బీజేపీకి మ‌ళ్లే అవ‌కాశం (Political Revenge)ఉంద‌ని రాజ‌కీయ అంచ‌నా.

బావ‌మ‌ర‌ద‌లు మ‌ధ్య రాజ‌కీయ వైరం 1995 నుంచి

బావ‌మ‌ర‌ద‌లు మ‌ధ్య రాజ‌కీయ వైరం 1995 నుంచి కొన‌సాగుతోంది. తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ అప్ప‌ట్లో చంద్ర‌బాబు ఏ మాత్రం అవ‌కాశం (Political Revenge) ఇవ్వ‌లేదు. ఆ విష‌యాన్ని నంద‌మూరి కుటుంబానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న వాళ్లు చెబుతుంటారు. అందుకే, ద‌గ్గుబాటి ఒకానొక స‌మ‌యంలో బీజేపీలో చేరారు. అక్క‌డ కూడా ఇమ‌డ‌లేని ప‌రిస్థితుల్లో రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ఆ స‌మ‌యంలో స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద్వారా 2004 ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నిక‌ల్లో ఎంపీగా పురంధ‌రేశ్వ‌రి, ఎమ్మెల్యేగా వెంక‌టేశ్వ‌ర‌రావు గెలుపొందారు. కేంద్ర మంత్రిగా పురంధరేశ్వ‌రికి అవ‌కాశం రావ‌డంతో మ‌ళ్లీ రాజ‌కీయ పున‌రుజ్జీవం పొందారు. రాష్ట్రం విడిపోయే వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగారు. అడ్డ‌గోలుగా రాష్ట్రాన్ని విభ‌జించిన కాంగ్రెస్ పార్టీని వీడారు.

రాజంపేట ను పొత్తుల్లో భాగంగా ఆమెకు కేటాయించేలా చంద్ర‌బాబు చ‌క్రం తిప్పార‌ని.

రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన త‌రువాత జరిగిన 2014 ఎన్నిక‌ల‌కు ముందుగా బీజేపీలో పురంధ‌రేశ్వ‌రి చేరారు. ఆమె భ‌ర్త వెంక‌టేశ్వ‌ర‌రావు మాత్రం వైసీపీలోనే ఉండిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో గెలిచే స్థానాలైన ఒంగోలు, విశాఖ‌ నుంచి ఎంపీగా పోటీ చేయాల‌ని ఆమె ప్ర‌య‌త్నం చేశారు. కానీ, చంద్ర‌బాబు మోకాలొడ్డారుర‌. ఆ ఎన్నిక‌ల్లో పొత్తుల కార‌ణంగా బీజేపీ కూడా చంద్ర‌బాబును కాద‌ని ఆమెకు న్యాయం చేయ‌లేకపోయింది. ఓడిపోయే సీట‌ని తెలిసి క‌డ‌ప జిల్లా రాజంపేట ను పొత్తుల్లో భాగంగా ఆమెకు కేటాయించేలా చంద్ర‌బాబు చ‌క్రం తిప్పార‌ని. (Political Revenge)అప్ప‌ట్లోని టాక్‌. ఎన్టీఆర్ స్థానంలో సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డానికి చంద్ర‌బాబుకు ద‌గ్గుబాటి స‌హ‌కారం అందించింది. అయితే, సీఎం అయిన ఆరు నెల‌ల‌కు ద‌గ్గుబాటి కుటుంబాన్ని చంద్ర‌బాబు దూరంగా పెట్టారని స‌ర్వ‌త్రా తెలిసిందే.

Also Read : NDA Meeting TDP: ఎన్డీయేలోకి టీడీపీ? జులై 18న ఢిల్లీలో ఎన్డీయే విస్తృత స్థాయి స‌మావేశం.. టీడీపీకి ఆహ్వానం!

ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీలోకి రానివ్వ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతూ ఇత‌ర పార్టీల్లో ఉన్న‌ప్ప‌టికీ టార్గెట్ గా వ్యూహాలు ర‌చించార‌ని చంద్ర‌బాబు మీద ద‌గ్గుబాటి కుటుంబానికి అనుమానం ఉండేది. ఇటీవ‌ల స్వ‌ర్గీయ ఎన్టీఆర్ మ‌నుమ‌రాలి వివాహ రిసెప్ష‌న్ సంద‌ర్భంగా వెంక‌టేశ్వ‌ర‌రావు, చంద్ర‌బాబు ఒకే ఫోటోలో క‌నిపించారు. దాన్ని బేస్ చేసుకుని తెలుగుదేశం పార్టీలోకి ద‌గ్గుబాటి కుటుంబం రాబోతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, వెంక‌టేశ్వ‌ర‌రావు రాజ‌కీయాల‌కు స్వ‌స్తి ప‌లికారు. కుమారుడు హితేష్ చెంచురామ్ రాజ‌కీయాల‌పై అయిష్టంగా ఉన్నారు. ఆ క్ర‌మంలో పురంధ‌రేశ్వ‌రికి కీల‌క ప‌ద‌విని బీజేపీ అప్ప‌గించింది. అంతేకాదు, చంద్ర‌బాబు టార్గెట్ గా  (Political Revenge)ప‌నిచేస్తూ బీజేపీని బ‌లోపేతం చేసే సంకేతాలు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

Also Read : CBN target : వైసీపీ బ‌లంపై చంద్ర‌బాబు గురి

అధిష్టానం ఇచ్చిన స్వేచ్ఛ‌తో ఎన్టీఆర్ గ‌ట్స్ ఉన్న పురంధ‌రేశ్వ‌రి బీజేపీని ఏపీలో బ‌లోపేతం చేయ‌డానికి అడుగులు వేస్తున్నారు. ఆ క్ర‌మంలో స‌మూల ప్ర‌క్షాళ‌న జ‌ర‌గ‌నుంది. ఎన్నిక‌ల టీమ్ ను సిద్దం చేసుకోబోతున్నారు. ఇక పొత్తుల విష‌యంలోనూ ఆమెది కీల‌క రోల్‌. అందుకే, రెండు ద‌శాబ్దాల‌కుపైగా చంద్ర‌బాబుపై రాజ‌కీయ రివేంజ్ తీర్చుకునేలా ఆమె అడుగులు ఉంటాయ‌ని స‌న్నిహితుల్లోని టాక్. అంటే, టీడీపీతో పొత్తు ఉండ‌ద‌ని భావిస్తున్నారు. జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి పోటీకి దిగ‌డానికి ఎక్కువ‌గా అవ‌కాశం ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.