Political Jail : విప‌రీత రాజ‌కీయాల్లో తెలుగోడు!

Political Jail : ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ప‌రిణామాలు మారుతూ ఉంటాయి.ఒక‌ప్పుడు సిగ‌రెట్‌ తాగే వాళ్ల‌ను చెడిపోయార‌ని స‌మాజం భావించేది.

  • Written By:
  • Publish Date - September 11, 2023 / 03:16 PM IST

Political Jail : ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ప‌రిణామాలు మారుతూ ఉంటాయి. సమాజం ఆలోచ‌న కూడా మారుతుంది. ఒక‌ప్పుడు సిగ‌రెట్‌ తాగే వాళ్ల‌ను చెడిపోయార‌ని స‌మాజం భావించేది. దాని స్థానంలో మ‌ద్యం రావ‌డంతో సిగ‌రెట్ తాగ‌డం పెద్ద త‌ప్పుకాద‌నే భావన చేరింది. ఆ రెండు వ్యస‌నాల స్థానంలో మ‌గువ చేర‌గానే, ముందు రెండు వ్య‌వ‌స‌నాలను స‌మాజం లైట్ గా తీసుకుంది. ఇప్పుడు లివింగ్ టూ గెద‌ర్ వ‌చ్చిన త‌రువాత అది కూడా కామ‌న్ గా నేటి స‌మాజం కొట్టిపారేస్తోంది. ఒక‌ప్పుడు స‌తీస‌హ‌గ‌మ‌నం ఉండేది. స‌మాజ ప‌రిణామ క్ర‌మంలో ఒక‌టికి మించిన వివాహాలు త‌ప్పు కాద‌నే ధోర‌ణి వ‌చ్చేసింది. ఇంత వివ‌ర‌ణ ఎందుకంటే, మారిన రాజ‌కీయ ప‌రిణామాలు, స‌మాజం పోక‌డ‌ను అవలోక‌నం చేసుకోవ‌డానికి సోదాహ‌ర‌ణ‌లుగా భావించ‌డానికి మాత్ర‌మే.

ఆత్మ‌గౌర‌వం అనే నినాదం కాంగ్రెస్ పార్టీని..(Political Jail)

మూడు ద‌శాబ్దాల తెలుగు రాజ‌కీయం, కొన్ని ప‌రిణామాల‌ను తీసుకుంటే..ఒక‌ప్పుడు అవినీతిని  ప్ర‌జానీకం సీరియ‌స్ గా తీసుకునేది. భోపాల్ కుంభ‌కోణం కాంగ్రెస్ పార్టీని ఒక‌ప్పుడు అధికారం నుంచి దించేసింది. పదేళ్లు అధికారంలో ఉన్న యూపీఏ మీద బొగ్గు, 2జీ, కామ‌న్వెల్త్ కుంభ‌కోణాలు వ‌చ్చాయి. సీన్ క‌ట్ చేస్తే, అధికారం కోల్పోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఆత్మ‌గౌర‌వం అనే నినాదం కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ల‌తో కూల్చేసింది. ఇదే స‌మాజం తిరిగి అదే కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. సంక్షేమ ప‌థ‌కాలు కొన్ని రోజులు తెలుగు స‌మాజంపై ప్ర‌భావం చూపాయి. అలాగని వాటి మీద ఆధార‌ప‌డి ఓట్లు ఆ త‌రువాత ఎన్నిక‌ల్లో వేయ‌లేదు. స్వ‌ర్గీయ రామారావు ప్ర‌వేశ‌పెట్టిన రెండు రూపాయ‌ల కిలో బియ్యం రాజ‌కీయ సంచ‌ల‌నాలు సృష్టించేలా తెలుగు స‌మాజం తీర్పు ఇచ్చింది.

ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోవ‌డాన్ని కాంగ్రెస్ పార్టీ రాద్దాంతం

ఒక‌ప్పుడు రౌడీలు, గుండాల‌కు భ‌య‌ప‌డి ఓటుకు దూరంగా కొంత స‌మాజం ఉండేది. ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల్లో స్వేచ్ఛాయుత ఓటింగ్ జ‌రిగేది కాదు. అలాంటి ప‌రిస్థితి నుంచి స్వేచ్చ‌గా ఓట్లు వేసే ప‌రిస్థితికి వ‌చ్చింది. డ‌బ్బు తీసుకుని ఓట్లు వేసే అలవాటు ఎక్కువ‌గా ఇప్పుడు క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల్లో నిల్చున్న అభ్య‌ర్థులు అవినీతిప‌రుడా, నేర‌స్తుడా అనేది చూడ‌కుండా డ‌బ్బు తీసుకుని ఓట్లు వేసే సంస్కృతి తెలుగునాట బాగా  ఉంది. ఒక‌ప్పుడు ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోవ‌డాన్ని కాంగ్రెస్ పార్టీ రాద్దాంతం చేసింది. కానీ, తెలుగు స‌మాజం ఎన్టీఆర్ ను 1994లో అప్ర‌తిహ‌తంగా గెలిపించారు. రెండో పెళ్లిని ఒక క్రేజ్  గా  తెలుగు స‌మాజం చూసింద‌న‌డానికి ఆ ఎన్నిక‌ల ఫలితాలు ఒక ఉదాహ‌ర‌ణ‌. ఆ త‌రువాత ఒక‌టికి మించిన పెళ్లిళ్లు చేసుకునే వాళ్లు కూడా పెరిగార‌ని పెద్ద‌లు చెప్పుకుంటారు. అదేమంటే, ఎన్టీఆర్ 70 ప్ల‌స్ లో చేసుకోగా తామెందుకు చేసుకోకూడదు అనే ప్ర‌శ్న సామాన్యులు వేసే వాళ్లు.

Also Read : Another shock to TDP : చంద్రబాబు బయటకు రాకుండా ఏపీ సర్కార్ మరో పిటిషన్..

అవినీతి అనేది రాజ‌కీయాల్లో 1999 నుంచి బాగా వినిపించేది. ఆనాడు సీఎంగా చంద్ర‌బాబు ఉన్న‌ప్పుడు ప్ర‌స్తుత తెలంగాణ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. అప్ప‌ట్లో ఫ‌ర్నిచ‌ర్ కొనుగోలు సంద‌ర్భంగా రూ. 70వేలు అవినీతి జ‌రిగింద‌ని ప‌త్రిక‌లో వార్త వ‌చ్చింది. వెంట‌నే ఆయ‌న్ను ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. ఇలాంటి వార్త‌లు వ‌స్తాయ‌ని రాజ‌కీయ నాయ‌కులు జాగ్ర‌త్త‌గా ఉండే వాళ్లు. 2004 ఎన్నిక‌ల నాటికి ఐఎంజీ, ఫుడ్ ఫ‌ర్ వ‌ర్క్ త‌దిత‌ర కుంభ‌కోణాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అత్యంత అవినీతి చేసిన సీఎంగా చంద్ర‌బాబునాయుడ్ని ఆ ఎన్నిక‌ల్లో  కాంగ్రెస్ ప్రొజెక్ట చేసింది. సీన్ క‌ట్ చేస్తే , వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని తెలుగు స‌మాజం సీఎంను చేసింది.

ప‌త్రిక‌ల‌ను చ‌ద‌వ‌ద్ద‌ని స‌హ‌చ‌రుల‌కు, అధికారుల‌కు వైఎస్ స‌ల‌హా

ఉమ్మ‌డి ఏపీ సీఎంగా రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేప‌ట్టిన జ‌ల‌య‌జ్ఞంలో జ‌రిగిన అక్ర‌మాల‌పై ప్ర‌తిరోజూ ప‌త్రిక‌ల్లో, ఛాన‌ళ్ల‌లో న్యూస్ వచ్చేది. కొంద‌రు మంత్రులు, ఎమ్మెల్యేల అక్ర‌మాల గురించి మీడియా ప్ర‌తి రోజూ బ‌య‌ట‌కు తీసేది. దీంతో ప‌త్రిక‌ల‌ను చ‌ద‌వ‌ద్ద‌ని స‌హ‌చ‌రుల‌కు, అధికారుల‌కు వైఎస్ స‌ల‌హా ఇచ్చే వాళ్లు. దీంతో మీడియా ప్రాధాన్యం క్ర‌మంగా త‌గ్గిపోయింది. స‌మాచార‌శాఖ యంత్రాంగానికి కూడా పనిలేకుండా పోయింది. తెలుగు మీడియాను ఆ రెండు ప‌త్రిక‌లంటూ చంద్ర‌బాబు అనుకూల ముద్ర‌వేశారు. దీంతో వేల కోట్ల అవినీతి గురించి న్యూస్ వ‌చ్చిన‌ప్ప‌టికీ లైట్ తీసుకునేలా తెలుగు ఓట‌ర్ల మైండ్ సెట్ మారింది. ఆ త‌రువాత చంద్ర‌బాబు అనుకూల, వ్య‌తిరేక మీడియాగా చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. దీంతో చంద్ర‌బాబు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన అవినీతి మీద ఇరు వ‌ర్గాలుగా విడిపోయిన మీడియా ప‌లు క‌థ‌నాల‌ను అల్లాయి. సీఎంగా వైఎస్ ఉండ‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ల‌క్ష కోట్లు సంపాదించార‌ని ఒక విభాగం మీడియా ముద్ర‌వేసింది.

Also Read : CBN – House Arrest Petition : చంద్రబాబు ‘హౌస్ అరెస్ట్’ పిటిషన్ పై విచారణ నేడే.. సర్వత్రా ఉత్కంఠ

ఉమ్మ‌డి సీఎంగా ఉండ‌గా చంద్ర‌బాబు సంపాదించిన ఆస్తుల విలువ, విడిపోయిన ఏపీకి సీఎంగా చేసిన చంద్ర‌బాబు 6ల‌క్ష‌ల కోట్లు సంపాదించార‌ని మ‌రో విభాగం మీడియా ముద్ర‌వేసింది. ఇలా పోటీప‌డి అవినీతి గురించి ప్ర‌జాధ‌నం దుర్వినియోగం గురించి న్యూస్ స‌మాజంలోకి వెళ్లాయి. దీంతో అవినీతి కామ‌న్ అనే ధోర‌ణికి తెలుగు ఓట‌ర్ల మైండ్ సెట్ ఫిక్స్ అయింది. ఇక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 16 నెల‌లు జైలు జీవితం అనుభ‌వించారు. అందుకే, ఆయ‌న ల‌క్ష కోట్ల దోచాడ‌ని టీడీపీ ప‌లు వేదిక‌ల‌పై ప్ర‌చారాన్ని హోరెత్తిచ్చింది. కానీ, 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ చేసిన జైలు ప‌క్షి, ల‌క్ష కోట్ల ప్ర‌చారం ప‌నిచేయ‌లేదు. కానీ, జైలు కెళ్లిన ఎపిసోడ్ ను చెబుతూ చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు క్లీన్ చిట్ ఇచ్చేసుకుంటున్నారు. ఇదే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి చిరాకు క‌లిగించింది. ఇప్పుడు చంద్ర‌బాబును కూడా జైలుకు పంపారు.

జైలుకు వెళ్ల‌డాన్ని కూడా తెలుగు స‌మాజం నాన్ సీరియ‌స్ గా తీసుకునేలా (Political Jail)

ఇక రాబోవు ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జైలు ప‌క్షి అనే ఆరోప‌ణ వినిపించ‌కుండా చేయ‌గ‌లిగారు. మాజీ మంత్రులు అచ్చెంనాయుడు, కొల్లు ర‌వీంద్ర‌, మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ధూళ్లి పాళ్ల న‌రేంద్ర‌, చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్..ఇలా అనేక మంది టీడీపీ నేత‌ల్ని జైలుకు పంపారు జ‌గ‌న్. ఇప్పుడు ఏకంగా చంద్ర‌బాబును రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు పంపారు. రేపోమాపో, లోకేష్ ను కూడా జైలుకు పంపే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అంటే, జైలుకు వెళ్ల‌డాన్ని కూడా తెలుగు స‌మాజం నాన్ సీరియ‌స్ గా తీసుకునేలా  మైండ్ సెట్ ను ఫిక్స్ చేశార‌న్న‌మాట‌. అంటే, తెలుగు స‌మాజం దేన్నీ పెద్ద‌గా త‌ప్పుగా భావించ‌కుండా స‌మ‌కాలీన రాజ‌కీయ నేత‌లు చేస్తున్నార‌ని బోధ‌ప‌డుతోంది. అవినీతికి పాల్ప‌డ‌డం, జైలుకు వెళ్ల‌డం, (Political Jail) పెళ్లిళ్లు ఎన్నైనా చేసుకోవ‌డం,వేధింపులు తదిత‌ర ఆరోప‌ణ‌ల‌న్నీ కామ‌న్ అనే స్థాయికి ఓట‌రు మైండ్ ను సెట్ చేశార‌న్న‌మాట‌.