టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్ ( Mahasena Rajesh), అతని అనుచరులపై కేసు నమోదైంది. తన ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టారని ఓ మహిళ ఫిర్యాదు చేయగా, కోనసీమ జిల్లా మలికిపురం స్టేషన్లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో తనపై జనవరి, ఫిబ్రవరిల్లో అనుచిత పోస్టులు చేశారని శంకరగుప్తంకు చెందిన నేతల శాంతి.. రాజేష్ తో పాటు ఆయన అనుచరులు రంజిత్‌మెహర్ (రాజోలు), యెల్లమిల్లి పండు (తూర్పుపాలెం), బోడపాటి చక్రి (తుని), వీరవల్లి ఏసుబాబు (భీమవరం), పృథ్వీరాజ్‌లపై కోనసీమ జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు రాజేష్ తో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేసారు.ఈ కేసుకు సంబంధించి మార్ఫింగ్ ఫొటోలపై స్పష్టత కోసం ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేశామని.. వివరాలు వచ్చాక చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసుపై రాజేశ్ మాట్లాడుతూ.. తన పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసారని, ఆ పోస్టులతో తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. మరి దర్యాప్తు చేపడితే కానీ అసలు నిజాలు బయటకు రావు.
ఇక రాజేష్ విషయానికి వస్తే.. జనసేన , పవన్ కళ్యాణ్ లకు సపోర్ట్ చేస్తూ… మహాసేన రాజేష్ గా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దుతు తెలిపి, ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత..అదే పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెడుతూ జనసేన కు మద్దతు తెలుపుతూ అతి త్వరగా ఫేమస్ అయ్యాడు. జనసేన పార్టీలో చేరతారని అంత భావించారు.. కానీ చివరి నిమిషంలో టీడీపీలో చేరి షాక్ ఇచ్చాడు. టిడిపిలో చేరిన ఆయనకు అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించారు. అయితే అనూహ్యంగా ఆయనకు ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పీ గన్నవరం సీటు కేటాయించింది. అయితే రాజేష్‌కు టికెట్ రావడాన్ని కొందరు వ్యతిరేకించడం తో టికెట్ ను వెనక్కు తీసుకున్నారు. ఆ తర్వాత రాజేష్ జనసేన పార్టీపై చేసిన వ్యాఖ్యలు ఆయన్ను కూటమికి దూరం చేసాయి. అప్పటి నుండి ఈయన్ను పెద్దగా ఎవ్వరు పట్టించుకోవడం మానేశారు. సోషల్ మీడియా లో కూడా పెద్దగా కనిపించినప్పటికీ..ఈయన గురించి మాట్లాడుకోవడం తగ్గించేశారు. కానీ ఇప్పుడు ఈయనపై కేసు నమోదు కావడం తో కాస్త ఈయన పేరు మీడియాలో వినిపిస్తుంది.
Read Also : Thaman ‘Dream’ : థమన్ ‘కల’ ఎంతో గొప్పది