Site icon HashtagU Telugu

Poornananda Swamy: బాలికపై రెండుళ్లుగా అత్యాచారం… బాబా వేషంలో కామాంధుడు

Poornananda Swamy

New Web Story Copy 2023 06 20t140813.074

Poornananda Swamy: లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 63 ఏళ్ల స్వామి పూర్ణానందపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఏడాది కాలంగా తనపై హత్యచారానికి పాల్పడుతున్నట్టు బాలిక ఫిర్యాదు చేయడంతో పోలీసులు దొంగ బాబాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే…

రాజమహేంద్రవరానికి చెందిన 15 ఏళ్ళ బాలిక చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో ఆమె బంధువులు బాలికను విశాఖపట్నంలోని వెంకోజిపాలెంలో ఉన్న ఆశ్రమంలో చేర్పించారు. ఆశ్రమానికి స్వామి పూర్ణానంద గురువుగా ఉన్నారు. అయితే దొంగ బాబా రోజూ రాత్రి బాలికను పడకగదికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. రెండేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నట్టు బాలిక వాపోయింది. దారుణం ఏంటంటే ఏడాది కాలంగా ఆ బాలికను ఒకే గదిలో బంధించి తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు.

బాలికకు రెండు చెంచాల ఆహారం మాత్రమే ఇస్తున్నారని, వారానికి ఒకసారి మాత్రమే స్నానానికి అనుమతిస్తున్నారని బాలిక పోలీసులకు తెలిపింది. ఇదిలా ఉండగా బాధితురాలు జూన్ 13న అక్కడ పనిచేసే ఓ మహిళా సహాయం తీసుకుని ఆశ్రమం నుంచి తప్పించుకోగలిగింది. ఎటు వెళ్లాలో తెలియక రైలు ఎక్కి తన పక్కనే కూర్చున్న మహిళా ప్రయాణికురాలికి తనపై జరిగిన హత్యాచారం గురించి చెప్పింది. దీంతో ఆ మహిళ ద్వారా బాలిక పోలీసులకు ఈ విషయాన్ని వివరించింది. స్వామి తనపై లైంగికంగా మరియు శారీరకంగా ఎలా వేధించాడో ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే నిందితుడుపై లైంగిక ఆరోపణలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2012లో ఆశ్రమంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అతడిని అరెస్టు చేసినప్పటికీ బెయిల్‌పై బయటకు వచ్చాడు.

Read More: Diamonds Water : వాటర్ బాటిల్ రూ.లక్ష.. వజ్రాలతో బాటిల్ క్యాప్