Site icon HashtagU Telugu

CM Chandrababu : ఏపీకి పోలవరం జీవనాడి : సీఎం చంద్రబాబు

Polavaram is the lifeblood of AP : CM Chandrababu

Polavaram is the lifeblood of AP : CM Chandrababu

CM Chandrababu : రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..ఏపీకి పోలవరం జీవనాడి అని.. కానీ వైసీపీ హయాంలో పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని మండిపడ్డారు. గత పాలకులు రాష్ట్రంలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేశారన్నారు. రాష్ట్రానికి రావాలంటే భయపడ్డారన్నారు. పారిశ్రామిక వేత్తలను కూడా భయపెట్టారని తెలిపారు. సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచుతామని.. ఆదాయం పెరిగితే పేదవాళ్ళకు సంక్షేమ పథకాలను అమలు చేసి పెద్దవాళ్ళను పైకి తీసుకురావచ్చని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వైసీపీ హయాంలో వ్యవస్థలను భ్రష్టు పట్టించారని విమర్శించారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా వెనుకాడే పరిస్థితి నెలకొందని తెలిపారు. పండుగల సంస్కృతిని కాపాడటమే అందరి బాధ్యత అని అన్నారు. గతంలో సంక్రాంతికి ఇప్పటి సంక్రాంతికి రాష్ట్రంలో రోడ్లలో తేడా స్పష్టంగా కనిపించిందన్నారు. అందరినీ ఫ్రీ వదిలివేశాం… వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారని సీఎం అన్నారు. తమిళనాడు సరిహద్దుల్లో ఉండటంతో రాయలసీమలో జల్లికట్టు ఉండేదని.. గ్రామాలకు ఈ సారి 10 లక్షల మంది వచ్చారని తెలిపారు. తమ మూలాలను గుర్తు పెట్టుకోవడం మంచి అలవాటన్నారు. తెలుగువారు గ్లోబల్‌గా ఎదుగుతున్నారన్నారు.

సంపదతో పాటు జనాభా సృష్టి కూడా జరగాలి అని సీఎం సూచించారు. అలాగే రాష్ట్రంలో అన్నిటికంటే అభివృద్ధి అనేది కీలకం. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. వ్యక్తిగత ఆదాయం పెరగాలి. ఆరోగ్యం బావుండాలి.. ఆనందంగా ఉండాలి. 2047 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపినీ తీర్చిదిద్దెలా ప్రణాళికలు రచిస్తున్నం. గడచిన కొన్నేళ్ళు గా 10 శాతం మాత్రమే వృద్ధి రేటు ఉంది. ప్రభుత్వ ప్రణాళికల్లో భాగంగా 15 శాతంగా వృద్ధి రేటు చేరితే జీఎస్డిపి 347 లక్షల కోట్లకు చేరుతుంది. తలసరి ఆదాయం 58 లక్షల కోట్ల మేర పెరిగే అవకాశం ఉంది. అన్ని అంశాల కంటే కీలకం అభివృద్ధి. ప్రజలకు ఇవన్నీ అర్థం కాకపోయినా వారి జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్న అంశం అని చంద్రబాబు పేర్కొన్నారు. ఐతే రాష్ట్రంలో టూరిజం 20 శాతం గ్రో అయ్యే అవకాశం ఉంటుందన్నారు.

Read Also: Republic celebrations : గణ‌తంత్ర వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్య‌క్షుడు