Venkaiah Naidu : వెంకయ్య నాయుడుకు అరుదైన గౌరవం.. కీలక అవకాశం కల్పించిన ప్రధాని

Venkaiah Naidu : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు మరో అరుదైన గౌరవం దక్కింది.

Published By: HashtagU Telugu Desk
Venkaiah Naidu

Venkaiah Naidu

Venkaiah Naidu : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక గాంధీ శాంతి బహుమతి జ్యూరీలో నామినేటెడ్‌ సభ్యునిగా ఆయనను నియమించే ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆమోదం తెలిపారు. 1995లో గాంధీజీ 125వ జయంతి సందర్భంగా గాంధీ శాంతి బహుమతి పేరుతో అవార్డును భారత సర్కారు ఏర్పాటు చేసింది. ఈ అవార్డులకు సంబంధించిన జ్యూరీకి  ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. గాంధీ శాంతి బహుమతికి ఎంపికయ్యే వారికి కోటి రూపాయల నగదుతో పాటు ప్రశంసా పత్రం, చేనేత వస్తువును బహూకరిస్తారు.  ఇటువంటి కీలకమైన అవార్డుల జ్యూరీలో చోటుపొందిన వెంకయ్య నాయుడు.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఉపరాష్ట్రపతిగా, కేంద్ర మంత్రిగా గతంలో సేవలు అందించారు.

We’re now on WhatsApp. Click to Join.

జాతీయ రాజకీయాల్లోకి రాకముందు వెంకయ్య నాయుడు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978 నుంచి 2017 వరకు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. 2002 నుంచి 2004 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన వెంకయ్య.. ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి వైదొలిగారు. ఒకప్పుడు బీజేపీ దిగ్గజం అద్వానీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఆయన 2014 ఎన్నికలకు ముందు మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని బలంగా సమర్థించారు. ఆ తర్వాత మోడీ తొలి ప్రభుత్వంలో  పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. 2017 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. భారత ఉపరాష్ట్రపతిగా ఆయన 2022 ఆగస్టు 10న పదవీకాలం(Venkaiah Naidu) పూర్తి చేసుకున్నారు.

Also Read: Russia-Ukraine War : ఉక్రెయిన్‌ ఫై మరోసారి దాడి చేసిన రష్యా

  Last Updated: 22 Oct 2023, 08:19 AM IST