Rs 60000 Crore Oil Refinery : ఏపీకి గుడ్ న్యూస్.. రూ.60వేల కోట్లతో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు పచ్చజెండా

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన రిక్వెస్టును పరిగణనలోకి తీసుకొని మోడీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.

Published By: HashtagU Telugu Desk
Pm Modi And Chandrababu

Rs 60000 Crore Oil Refinery : ఆంధ్రప్రదేశ్‌కు కీలక ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రంలో రూ.60వేల కోట్ల పెట్టుబడితో ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు కేంద్ర సర్కారు పచ్చజెండా ఊపింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన రిక్వెస్టును పరిగణనలోకి తీసుకొని మోడీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే సర్కారులో కింగ్ మేకర్‌గా మారిన నారా చంద్రబాబు నాయుడుకు దీన్ని తొలి విజయంగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరీతో ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు భేటీ అయిన ఐదు రోజుల తర్వాత ఆయిల్ రిఫైనరీ(Rs 60000 Crore Oil Refinery) ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడటం గమనార్హం. ఏపీలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు సాధ్యా సాధ్యాలపై చర్చించేందుకు బుధవారం రోజు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( బీపీసీఎల్) ఉన్నతాధికారులతో చంద్రబాబు సమావేశమైనట్లు తెలిసింది. ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు ఏపీలోని  శ్రీకాకుళం, మచిలీపట్నం, రామాయపట్నం ప్రాంతాల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.  ఏపీలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కోసం దాదాపు 5,000 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా. జూలై 23న సమర్పించే కేంద్ర బడ్జెట్‌లో ఈ ఆయిల్ రిఫైనరీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయబోయే స్థలానికి సంబంధించిన వివరాలు తర్వాత ఖరారు చేసే అవకాశం ఉంది. దీనిపై తుది నిర్ణయానికి రావడానికి ఇంకో రెండు నెలల టైం పడుతుందని తెలుస్తోంది.  ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటయ్యే స్థలంపై ప్రకటన ఉండదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ అంశంపై బీపీసీఎల్ అధికార వర్గాల నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన కూడా వెలువడలేదు.

Also Read :Bandi Sanjay : వాళ్లు వీరప్పన్ వారసులు.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు : బండి సంజయ్

ఏపీలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేస్తామనే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ప్రస్తావించారు. ఆ చట్టంలోని సెక్షన్ 93లో.. ‘‘ఏపీ పురోగతి కోసం పద మూడో షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా అవసరమైన అన్ని చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. నియమిత రోజు నుంచి 10 సంవత్సరాల వ్యవధిలోగా ఇందుకోసం చర్యలు చేపడుతుంది’’ అని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని  పదమూడో షెడ్యూల్‌లో ఉన్న “ఇన్‌ఫ్రాస్ట్రక్చర్” విభాగంలోని నాలుగో పాయింట్ ప్రకారం.. ‘‘IOC లేదా HPCL సంస్థలు నియమిత రోజు నుంచి ఆరు నెలలలోపు ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్ ముడి చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను స్థాపించే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాయి. దానిపై ఒక నిర్ణయం తీసుకుంటాయి’’ అని ఉంది. ఇప్పుడు ఈ హామీని నెరవేర్చే దిశగా కేంద్ర సర్కారు నడుంబిగించింది. సీఎం చంద్రబాబు(Chandrababu Naidu)  చొరవతో ఈ హామీ అమల్లోకి రాబోతోంది.

  Last Updated: 11 Jul 2024, 12:26 PM IST