Site icon HashtagU Telugu

PM Modi Arrives Boppudi : ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికిన కూటమి శ్రేణులు

Modi Welcome

Modi Welcome

ఏపీ అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కూటమిగా ఏర్పడిన టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) లు ఈరోజు తమ మొదటి భారీ బహిరంగ సభ ను పల్నాడు జిల్లా చిలకలూరిపేట (Chilakaluripeta) నియోజకవర్గం బొప్పూడి లో ఏర్పటు చేసారు. ‘ప్రజాగళం’ (Praja Galam) పేరుతో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ , టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లతో పాటు మూడు పార్టీల నేతలు , కార్యకర్తలు , అభిమానులు హాజరయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

కొద్దీ సేపటి క్రితం ప్రధాని మోడీ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నాలుగు హెలికాప్టర్ల కాన్వాయ్ తో మోడీ బొప్పూడికి చేరుకున్నారు. ఈ క్రమంలో మోడీకి మూడు పార్టీల నేతలు ఘన స్వాగతం పలికారు.ఇక, హెలిప్యాడ్ నుంచి టయోటా ఫార్చ్యూనర్ వాహనంలో మోదీ సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. మోడీ సభ వేదిక పైకి రాగానే సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది. జై మోడీ..జై శ్రీ రామ్ అనే నినాదాలతో ప్రజాగళం సభ మార్మోగిపోయింది. ప్రధాని మోడీ ని… చంద్రబాబు, పవన్, పురందేశ్వరి సత్కరించారు.

పదేళ్ల తర్వాత తొలిసారిగా మోడీ (Modi) , చంద్రబాబు (Chandrababu) , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు ఒకే వేదికపైకి రావడం తో పార్టీల శ్రేణుల్లో ఆనందం మాములుగా లేదు. 2014లో ఈ ముగ్గురు చేయి కలిపి ఏపీలో విజయం సాధించడం తెలిసిందే. 2019లో కూటమి విడిపోయింది. ఇప్పుడు పరిస్థితులు ఈ మూడు పార్టీలను మళ్లీ కలిపాయి. ప్రజాగళం సభతో మూడు పార్టీల కూటమి ఎన్నికల యుద్ధభేరి మోగించనుంది.

Read Also  : CM Revanth Flight Emergency Landing : సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం..