Site icon HashtagU Telugu

PM Modi : గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ

PM Modi

PM Modi

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగిన ప్రధాని మోడీకి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుతో పాటు మంత్రులు, కూటమి నాయకులు స్వాగతం పలికారు. ప్రధాని మోడీ నేరుగా అమరావతిలోని సచివాలయానికి వెళ్లనున్నారు. ఏపీ రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులను మోడీ ప్రారంభించనున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రధాని ప్రసంగిస్తారు. ఇక, ప్రధాని మోడీ గన్నవరం నుండి వెలగపూడి బయలుదేరారు . అక్కడ ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నాయి. అక్కడినుండి వీరంతా అమరావతి పునర్నిర్మాణ సభా ప్రాంగణానికి చేరుకుంటారు.

Read Also: Amaravati : అమరావతికి మణిహారంగా మారనున్న క్షిపణీ పరీక్ష కేంద్రం

ప్రధాని మోడీ ప్రారంభించనున్న రైల్వే ప్రాజెక్టులు

గుంతకల్ వెస్ట్ – మల్లప్ప గేట్ రైల్వే లైన్ – రూ. 293 కోట్లు
ఖాజీపేట – విజయవాడ 3వ లైన్ – రూ. 254 కోట్లు
బుగ్గనపల్లి – పాణ్యం డబ్లింగ్ లైన్లు (గుంటూరు – గుంతకల్ ప్రాజెక్టులో భాగంగా)
హైవే, రవాణా ప్రాజెక్టులు (NHAI): నేషనల్ హైవే ప్రాజెక్టులు – రూ. 3,176 కోట్లు (వర్చువల్ శంకుస్థాపన), పలు NH పనులు ప్రారంభం – రూ. 3,680 కోట్లు

పైలాన్‌ను ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ..

అమరావతి రీలాంచ్‌కు సర్వం సిద్ధమైంది. రూ.58 వేల కోట్లకు పైగా పనులకు శ్రీకారం చుట్టేందుకు ప్రధాని మోడీ అమరావతి వస్తున్నారు. అమరావతి పునర్‌నిర్మాణానికి సూచికగా A ఆకారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్‌ను మోడీ ఆవిష్కరించనున్నారు.

అమరావతి రాజధాని ప్రాజెక్టుల కోసం శంకుస్థాపన..

మొత్తం విలువ: రూ. 49,040 కోట్లు
నిర్మించబోయే భవనాలు
కొత్త హైకోర్టు
సచివాలయం
శాసనసభ భవనం
న్యాయమూర్తుల నివాస సముదాయం
ఎమ్మెల్యేలు, మంత్రులు, IAS అధికారుల గృహ సముదాయాలు

Read Also:  Kaleshwaram: కాళేశ్వరం మానవ నిర్మిత ‘భారీ విపత్తు’?