PK-Jagan-CBN : BJP క‌ర్ణాట‌క గేమ్‌,APఅగ్ర నేత‌లపై ఢిల్లీ రైడ్‌!

ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు ఏపీ లీడ‌ర్ల‌ను(PK-Jagan-CBN) ఆడిస్తున్నారు.

  • Written By:
  • Updated On - April 4, 2023 / 10:47 AM IST

ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు ఏపీ లీడ‌ర్ల‌ను(PK-Jagan-CBN) ఆడిస్తున్నారు. ప్ర‌ధాన పార్టీల అధిప‌తులు బీజేపీకి(BJP) దాసోహం  అంటున్నారు. తెర‌వెనుక చంద్ర‌బాబు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌హ‌కారం అందిస్తున్నారు. బీజేపీతో నేరుగా పొత్తులో జ‌న‌సేనాని ప‌వ‌న్ ఉన్నారు. ఒక్కొక్క‌ళ్ల‌ను ఢిల్లీకి పిలిపించుకుని ఎవ‌రు ఎలాంటి రోల్ పోషించాలో నిర్దేశిస్తున్నారు. వాళ్ల అడుగులకు మ‌డుగులు ఒత్తుతూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను గాలికి వ‌దిలేశార‌ని స‌గ‌టు ఏపీ ఓట‌రు ఫీల్ అవుతున్న ప‌రిస్థితి ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.

 ఏపీ ప్ర‌ధాన పార్టీల అధిప‌తులు  ఢిల్లీ  బీజేపీకి  దాసోహం  (PK-Jagan-CBN)

హుటాహుటిని ప‌వ‌న్ ఢిల్లీ వెళ్లారు. బీజేపీ పెద్ద‌ల ఇచ్చే డైరెక్ష‌న్ ను విన‌డానికి ప‌యనం అయ్యారు. ఆయ‌న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డాతో భేటీ కానున్నారు. వాళ్లిచ్చే బ్లూ ప్రింట్ తీసుకుని న‌డ‌వ‌బోతున్నారు. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజీగా ఉన్న షా, న‌డ్డా వీలున్నంత వ‌ర‌కు ఏపీ లీడ‌ర్లంద‌రినీ (PK-Jagan-CBN)ఉప‌యోగించుకుంటున్నారు. ఆర్థికంగా, సామాజికంగా, గ్లామ‌ర్ ప‌రంగా వైసీపీ, జ‌న‌సేన మ‌ద్ధ‌తు ఇవ్వ‌డానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాయి. కాక‌పోతే, టీడీపీ మాత్రం తెర వెనుక ఉంటూ మ‌ద్ధతు ఇవ్వాల్సి వ‌స్తోంది.

బ్లూ ప్రింట్ మేర‌కు న‌డుచుకుంటానంటూ ప‌వ‌న్

ఏపీ రాష్ట్రంలో ప‌లు స‌మ‌స్య‌లు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడేందుకు ఎవ‌రూ పెద్ద‌గా చొర‌వ చూపిన దాఖ‌లాలు లేవు. నాలుగేళ్లుగా ప‌లుమార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం విన‌త‌ప‌త్రం ఇవ్వ‌డం మిన‌హా ఆయ‌న ఏమీ చేయలేక‌పోయారు. ఇక జ‌న‌సేనాని ప‌వ‌న్ బీజేపీ పొత్తు అంటారు. కానీ, రాష్ట్రం కోసం విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న అంశాల‌ను ఏ ఒక్క రోజు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పోరాడిన దృష్టాంతాలు లేవు. కేవ‌లం టీడీపీని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి ఆయ‌న్ను బీజేపీ వాడుకుంటూ ఉంది. బ్లూ ప్రింట్ మేర‌కు న‌డుచుకుంటానంటూ ప‌వ‌న్ ప‌లుమార్లు చెప్పారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా చూస్తానంటూ ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పారు. ఇప్పుడు బీజేపీ కాల్ రాగానే ప‌రుగెడుతూ విమానం ఎక్కారు. ప్ర‌త్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌, రాజ‌ధాని అమ‌రావ‌తి, పోల‌వ‌రం త‌దిత‌రాల గురించి మాట్లాడేందుకు ఆయ‌న వెళ్ల‌లేదు. కేవలం ఆయ‌నకున్న గ్లామ‌ర్ ను క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఉప‌యోగించుకోవ‌డానికి ర‌మ్మ‌న్నారు. ఆయ‌న వెళ్లడం  అనేది స‌ర్వ‌త్రా తెలిసిన అంశ‌మే.

క‌ర్ణాట‌క ప్రాంతాల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, గాలి హ‌వా

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల రెండుసార్లు ఢిల్లీ బీజేపీ(BJP) పెద్ద‌ల పిలుపు మేర‌కు వెళ్లారు. అక్క‌డ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కంటే క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఆర్థిక స‌హాయం, బీజేపీ గెలుపు కోసం ఎత్తుగ‌డ‌ల‌ను వినిపించార‌ట‌. వాటికి త‌లాడిస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బీజేపీకి దాసోహం అవుతూ ముందుకు క‌దులుతున్నార‌ని వినికిడి. ఆ క్రమంలోనే గాలి జనార్థ‌న్ రెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావం జ‌రిగిందని తెలుస్తోంది. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, గాలి జనార్థ‌న్ రెడ్డి ఇద్ద‌రూ రాజ‌కీయంగా ఒక‌టే. వ్యాపార ప‌రంగానూ వాళ్లిద్ద‌రికీ సంబంధాలు ఉన్నాయ‌ని జగద్విదితం . ఓబులాపురం మైనింగ్ కేసులు అందుకు నిద‌ర్శ‌నాలు. మ‌ధ్య‌, ఉత్త‌ర, తూర్పు క‌ర్ణాట‌క ప్రాంతాల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, గాలి హ‌వా ప‌నిచేస్తోంది. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి బ్లూ ప్రింట్ ఇచ్చి పంపిన బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఆహ్వానించార‌ని తెలుస్తోంది. ఆయ‌న గ్లామ‌ర్ ను ప్ర‌చారం కోసం ఉప‌యోగించుకుంటార‌ని స‌మాచారం.

రాష్ట్ర‌ప‌తి , ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో టీడీపీ మ‌ద్ధ‌తు 

ఇక చంద్ర‌బాబు నాయుడు చాలా కాలంగా బీజేపీ పెద్ద‌ల పిలుపు కోసం ఎదురు  చూస్తున్నారు. ఆ మ‌ధ్య రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్లోని ఒక ప్రోగ్రామ్ లో మోడీతో క‌లిశారు. జీ 20 దేశాల స‌ద‌స్సు స‌న్నాహాక స‌మావేశాల్లో ఒక సారి మాట‌లు క‌లిపే అవ‌కాశం బాబుకు వ‌చ్చింది. ఆ రెండు సంఘ‌ట‌న‌ల త‌రువాత టీడీపీ, బీజేపీ పొత్తు ఖాయ‌మంటూ ప్ర‌చారం జ‌రిగింది. కానీ, రాజ‌కీయ ప‌ర‌మైన చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డానికి ఏనాడూ చంద్ర‌బాబును బీజేపీ పెద్ద‌లు పిలువ‌లేదు. కాక‌పోతే, చంద్ర‌బాబు ఒక అడుగు ముందుకేసి రాష్ట్ర‌ప‌తి , ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో టీడీపీ మ‌ద్ధ‌తు ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ పొత్తు దిశ‌గా బీజేపీ చంద్ర‌బాబుకు సంకేతాలు ఇవ్వ‌లేదు. సానుకూల సంకేతాల కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే, రాహుల్ మీద అన‌ర్హ‌త వేటు ప‌డిన ఎపిసోడ్ మీద కూడా టీడీపీ మౌనంగా ఉండిపోయింది.

Also Read : CBN TDP : టార్గెట్ 160 దిశ‌గా చంద్ర‌బాబు, రీజిన‌ల్ ఎత్తుగ‌డ.!

ఏపీ లీడ‌ర్ల‌ను(PK-Jagan-CBN) కర్ణాట‌క ఎన్నిక‌ల్లో గెలుపు కోసం(PK-Jagan-CBN)

తాజాగా బీజేపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి టీడీపీ లీడ‌ర్ల‌తో స‌మావేశం అయ్యారు. ప‌రోక్షంగా క‌ర్ణాట‌క మ‌ద్ధ‌తు కోసం ఆ భేటీ జ‌రిగిందా? ఫండ్ రైజింగ్ చేసిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీని గెలిపించ‌డానికి ప్ర‌య‌త్నం జ‌రుగుతుందా? అనే అనుమానం సుజనా మీటింగ్ క‌లిగిస్తోంది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో తెర వెనుక చంద్ర‌బాబు కూడా మ‌ద్ద‌తు ఇస్తే అప్పుడు పొత్తుల గురించి చ‌ర్చిద్దామ‌నే సంకేతం బీజేపీ ఇచ్చింద‌ని తెలుస్తోంది. అందుకే, సుజ‌నా చౌద‌రి టీడీపీ ప్ర‌భావం ఉన్న క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల మీద చంద్ర‌బాబు ఫోక‌స్ చేసేలా ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని తెలుస్తోంది. మొత్తం మీద ఏపీ లీడ‌ర్ల‌ను(PK-Jagan-CBN) కర్ణాట‌క ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ఒక్కొక్క‌ర్ని ఒక్కోలా బీజేపీ వాడుకుంటుంద‌ని తాజా ప‌రిణామాల ఆధారంగా అర్థ‌మ‌వుతోంది. ఢిల్లీ బీజేపీ (BJP) పెద్ద‌ల వ‌ద్ద దాసోహం అంటూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోని ఏపీ లీడ‌ర్ల వాల‌కం విచిత్రం. ఎప్పుడు ఢిల్లీ కాల్ వ‌స్తుందా? అని ఎదురుచూస్తూ జ‌బ్బ‌లు చ‌రుసుకుంటున్నారు. ఇలాంటి ప‌రిణామం ఏపీ రాజ‌కీయ చ‌రిత్ర‌లో మునుపెన్న‌డూ లేద‌ని అంద‌రికీ తెలిసిందే.!

Also Read : Sujana entry into TDP?: టీడీపీలోకి సుజనా ఎంట్రీ? సీనియర్లలో ఆందోళన!