ఏపీలో రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. గత 10 రోజులుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం (Nara Lokesh as a AP Deputy CM) పదవికి ఎంపిక చేయాలంటూ వరుసపెట్టి టీడీపీ నేతలు ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. మొన్న మహాజన రాజేష్ , నిన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి (TDP Srinivas Reddy ), నేడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) ఇలా వరుసపెట్టి నేతలు , పార్టీ శ్రేణులు తమ వాదనను వినిపిస్తుండడం..రాబోయే రోజుల్లో కూటమిలో ఎలాంటి చీలికలు వస్తాయో అని ఖంగారు పడుతున్నారు. ఈ క్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సైతం లోకేష్ కు జై కొట్టడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.
US President Vs World Leaders : అమెరికాను మించిన రేంజులో ఈ దేశాధినేతలకు శాలరీలు
టీడీపీలో కోటి సభ్యత్వాలు చేయించిన ఘనత మంత్రి లోకేశ్ కు చెల్లిందని , అలాంటి వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం కరెక్ట్ అని వర్మ చెప్పుకొచ్చారు. ‘ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయి. ఓడిపోయిన జగన్ను కూడా సీఎం సీఎం అంటున్నారు. పవన్ సీఎం కావాలని జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు. అలాగే టీడీపీని బలోపేతం చేసిన లోకేశ్ డిప్యూటీ సీఎం అయితే తప్పేంటి?’ అని ప్రశ్నించారు. ఇలా వరుసపెట్టి నేతలు లోకేష్ జై కొడుతుండడం తో జనసేన శ్రేణుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మరి ఈ విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.