స్కిల్ డెవలప్ కేసులో మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ అయ్యి..జైలు లో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 22 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారు. బాబు అరెస్ట్ అయినదగ్గరి నుండి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా బాబు అరెస్ట్ ను ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా బిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు సైతం బాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. ఈ వయసులో ఆయనను ఇలా అరెస్ట్ చేయడం దురదృష్టకరమని హరీష్ రావు (Harish Rao) చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడిన చంద్రబాబు… ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి గురించి కూడా మంచి మాటలు చెప్పారని అన్నారు.
హరీష్ రావు కామెంట్స్ ఫై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani ) స్పందించారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు ఏమవుతాడో, కేసీఆర్ కు హరీశ్ రావు ఏమవుతాడో అందరికీ తెలిసిందేనని, నాడు ఎన్టీఆర్ కు చంద్రబాబు ఏంచేశాడో, హరీశ్ రావు కూడా కేసీఆర్ కు అదే చేస్తాడని వ్యాఖ్యానించారు. ఈ అల్లుళ్ల గిల్లుళ్లు అందరికీ తెలుసని పేర్ని నాని విమర్శించారు. హరీశ్ రావు 2018లో కేసీఆర్ ను గిల్లాడని, దాంతో హరీశ్ రావును కేసీఆర్ పక్కనబెట్టేశాడని పేర్కొన్నారు. కేసీఆర్ తెలివైన వాడు కాబట్టి హరీశ్ రావు ప్రయత్నాలను గుర్తించాడని వెల్లడించారు. మరి పేర్ని నాని వ్యాఖ్యలపై బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి హరీష్ రావు ఎలా స్పందిస్తారో చూడాలి.
Read Also : Gujarat Narnia : గుజరాత్ తీరంలో ‘నార్నియా’ మూవీ సీన్ నిజమైన వేళ..