Site icon HashtagU Telugu

Perni Nani Family Missing : అజ్ఞాతంలో పేర్ని నాని ఫ్యామిలీ..?

Perni Nani Family Missing

Perni Nani Family Missing

మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వార్తలు ఇప్పుడు కృష్ణా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తున్న పేర్ని నాని కుటుంబ సభ్యులు, మూడు రోజులుగా అందుబాటులో లేరని సమాచారం. ఈ వార్త ఇప్పుడు కృష్ణా జిల్లాలో వైసీపీకి ఊహించని షాక్‌ గా మారింది. సివిల్ సప్లై గూడెంలో బియ్యం అవకతవకల కేసు నేపథ్యంతో పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెను ప్రధాన నిందితురాలిగా పేర్కొంటూ, పోలీస్‌ అధికారులు చర్యలు చేపట్టారు. జయసుధతో పాటు పేర్ని నాని పీఏలపై కూడా నిందితులుగా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారం పేర్ని కుటుంబంపై తీవ్ర ఆరోపణలు తెచ్చింది.

ఈ కేసు విషయంలో ముందస్తు బెయిల్ కోసం మచిలీపట్నం జిల్లా కోర్టులో జయసుధ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ సంఘటనల మధ్య పేర్ని నాని కుటుంబం మూడు రోజులుగా ఫోన్‌ స్విచాఫ్‌ చేసి, కనబడకపోవడం ఆందోళనకరంగా మారింది. పోలీసుల అరెస్ట్ నుండి తప్పించుకునేందుకు పేర్ని కుటుంబం తాత్కాలికంగా అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటుందని అంత అభిప్రాయపడుతున్నారు. నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లడం, వారి పైన కేసులు నమోదవడం వంటి పరిణామాలు పార్టీకి తీవ్ర ప్రతికూలతను తెచ్చే అవకాశముంది.

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం (Ration rice in Andhra Pradesh) అక్రమ రవాణా కేసు మరింత స్పీడ్ అందుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ(Nani’s wife, Jayasudha)పై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు (Machilipatnam police registered a case) చేశారు. సివిల్ సప్లైస్ అధికారి కోటి రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. గత ప్రభుత్వం వైసీపీ హయాంలో జయసుధ పేరిట పేర్ని నాని ఒక గిడ్డంగి నిర్మించారు. ఈ గిడ్డంగిని పౌర సరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. అయితే ఇటీవలి పోలీసుల తనిఖీల్లో ఈ గిడ్డంగి ఉపయోగంలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ గిడ్డంగిలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ఉపయోగపడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గిడ్డంగిలో జరిగిన అక్రమాలను గుర్తించిన అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారు. పౌర సరఫరాల శాఖ నుండి వచ్చిన సమాచారం ఆధారంగా గిడ్డంగి నిర్వహణలో జరిగిన లోపాలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also : Weight Loss: కిలోల కొద్ది బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే రాత్రిపూట ఈ వెజ్ ఫుడ్స్ తినాల్సిందే!