Site icon HashtagU Telugu

Jagan House : ప్రజల సొమ్ము.. కంచెకు పెట్టిన జగన్

Jagan House Tadepalli

Jagan House Tadepalli

మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)..ఐదేళ్ల సీఎం పోస్ట్ లో ప్రజల సొమ్మను ఎంతలా వాడుకోవాలో అంతలా వాడేసాడనే సంగతి తెలిసిందే. సీఎం మాత్రమే కాదు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు నుండి కింది స్థాయి కార్యకర్తల వరకు అంత తెగమింగేసారు. జగన్ అయితే తన ఇంటి చుట్టూ (Tadepalli Jagan House) నిర్మించుకున్న కంచె కే ప్రజల సొమ్ము రూ. 12 కోట్ల 85 లక్షల రూపాయలు వాడుకున్నట్లు తాజాగా అధికార పార్టీ తెలిపింది.

తాడేపల్లిలోని జగన్ మోహన్ రెడ్డి ఇల్లు ఏ రేంజ్ లో ఉంటుందో తెలియంది కాదు..దాదాపుగా రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఇంటి చుట్టూ.. 30 అడుగుల ఎత్తున ఇనుప మెషన్ తరహా నిర్మాణం చేపట్టారు. జగన్ నివాసం దిగువ దిగువ భాగంలో ఉందని.. దీనికి సమీపంలోనే ఎత్తైన భవనాలతో పాటుగా పక్కనే బకింగ్హామ్ కెనాల్ కాల్వ గట్టు ఎత్తులో ఉండడాన్ని అధికారులు గమనించి.. జగన్ ఇంటి చుట్టూ ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని సూచించడం తో ఆలా ఏర్పాటు చేసారని వైసీపీ నేతల వాదన.

ప్యాలెస్ కట్టడానికే రెండు కోట్లు ఖర్చు అయితే.. ఇనుస మెష్ కోసమే పదమూడు కోట్లు ప్రజాధనం ఎలా ఖర్చు పెట్టారని టీడీపీ (TDP) సోషల్ మీడియా ప్రశ్నిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఖర్చుతో కొనుగోలు చేసిన ఫర్నీచర్ ను పార్టీ ఆఫీసుగా మార్చిన క్యాంపు కార్యాలయంలో ఇంకా వాడుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ కార్యాలయంగా జగన్ ఇంటినే ఉపయోగిస్తున్నారు. గతంలో అది సీఎం క్యాంపు కార్యాలయంగా ఉంది. ఆ క్యాంప్ కార్యాలయానికి మొత్తం ప్రజాధనంతోనే ఏర్పాటు చేశారు. ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఏసీలు, చివరికి ఇంటి కిటికీలు కూడా ప్రజాధనంతో కొనుగోలు చేశారని టీడీపీ ఆరోపించింది. ఈమేరకు సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది టీడీపీ.

Read Also : Photo Morphing Case : కొండా సురేఖ – ఎంపీ రఘునందన్ రావు ఫొటోస్ మార్ఫింగ్ కేసులో ఇద్దరి అరెస్ట్