Site icon HashtagU Telugu

Pawan Kalyan: జనం ఏమన్నా పిచ్చోళ్లా పవన్…నీకంటే ఊసరవెల్లే బెటర్..!

Pawan Over Action

Pawan Over Action

Pawan Kalyan Over Action: ఎవరో స్టార్ డైరెక్టర్ రాసిచ్చిన స్క్రిప్ట్‌ని నువ్వెందుకు చదివావ్.? ఎందుకు అభాసు పాలు అయ్యావ్. ? కూటమి మీద కేంద్రానికి ఒక రకమైన నమ్మకం ఉంది అంటే…అది నీవల్ల కాదు. నీ ధ్వంద వైఖరి వల్ల అస్సలే కాదు. కేవలం చంద్రబాబు (Chandrababu Naidu) క్రెడిబిలిటీ వల్లే…ఏపీ పరువు నిలుస్తోంది? తిరుమల వెళ్లి డిక్లరేషన్ ఇప్పుడెందుకు ఇచ్చావ్?  తిరుమల కొండపై సినిమా డ్రామా నిజం కాదా? జగన్‌ డిక్లరేషన్ ఇవ్వలేదు కాబట్టే… నీ కూతురికి డిక్లరేషన్ (Declaration) ఇచ్చావా..? కొండకు(TTD) వెళ్లడం వరకు ఒకే..ఇన్నాళ్లూ లేని వ్యవహారాన్ని ఇప్పుడెందుకు సాగదీస్తున్నావ్.

ఒక సినిమాలో వేళ్లపై కార్లు ఎక్కించుకున్నావ్ కదా…ఇప్పుడెందుకు మెట్లు ఎక్కలేకపోతున్నావ్? చంద్రబాబు (Chandra Babu Naidu), జగన్ (Jagan) ఈజీగా ఐదు గంటల్లో మెట్లు ఎక్కేస్తారు? జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నా..కరాటీ తెలుసు అని అన్ని మాటలు చెప్తావ్ కదా.. ఫిజికల్ ఫిట్‌నెస్ (Physical Fitness) గురించి…మరి  మెట్ల దగ్గర ఎందుకు ఆపసోపాలు పడ్డావ్. ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతల్ని (Ycp Leaders) తిట్టిన పవన్…ఇప్పుడు.నీ పార్టీలోకి ఎలా తీసుకుంటావ్. అప్పుడు చెడ్డోళ్లు…ఇప్పుడు మంచోళ్లు అయ్యారా? ఇదేనా నీ ధర్మమా? ఈ వ్యవహారాన్ని బట్టి చూస్తే…ఏపీకి మరో ఏక్‌నాథ్‌షిండే లా తయారు అవుతున్నావా?

అధికారంలోకి వచ్చాక అది చేస్తా…ఇది చేస్తానన్న పవన్ (Pawan)…ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నాడు? నిజంగా…ఆంధ్రప్రదేశ్ ఉన్న స్థితి…అందరికీ తెలుసు. ఒక రాజధాని లేదు… ఆదాయం లేదు. గొప్పగా చెప్పుకోడానికి ఏమీ లేవు. ఉన్నవి అప్పులు తప్పా…! మరి ఇలాంటి నేపధ్యంలో సనాతన ధర్మం (Sanathan Dharma) గురించి డిక్లరేషన్ ఇచ్చేంత ఇది మనస్సు పవన్‌కి (Pawan) ఎందుకు? నిజంగా అవసరమా అంటే….అస్సలు అవసరం లేదు. పేదల ఆకలి తీరుస్తా…పెద్దోళ్ల భరతం పడతానని…ఆ రోజు బీరాలు పలికి….ఇప్పుడు ధర్మం అంటూ రోడ్డెక్కితే…నమ్ముకున్న ప్రజల (Common People) పరిస్థితి ఏం కావాలి?

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. పూర్తిగా సోషలిస్టు భావాలతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. చెగువెరా వారసునిగా ప్రచారం చేసుకున్నారు. చెగువెరా (Che Guvera) స్టైల్‌ను ఫాలో అయ్యాడు. దూకుడుగా వ్యవహరించారు. ప్రజావ్యతిరేక పాలకులపై తిరగబడే నేతగా గుర్తింపు పొందారు. తన వేదికపై పూలే, కాన్షీరామ్, చెగువెరా లాంటి ఫొటోలు ఉంచి ఆకట్టుకున్నాడు. 2018లో తెలంగాణ అసెంబ్లీకి (Telangana Assembly Elections) జరిగిన ముందస్తు ఎన్నికల్లో…సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేసింది జనసేన. తద్వారా తనది కమ్యూనిస్టు భావజాలమని మరోమారు చెప్పారు. పవనిజం పేరుతో ఓ పుస్తకం కూడా విడుదల చేశారు. తర్వాత 2019 జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులతోపాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు.

కట్ చేస్తే… పవన్‌ సనాతన ధర్మ పరిరక్షకుడిగా ప్రకటించుకున్నారు. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో ఆయన ప్రాయశ్చిత్త దీక్ష (Deeksha) చేశారు. అంతకు ముందు సనాతన ధర్మం (Sanathan Dharma) గురించి మాట్లాడారు. హిందువుల్లో (Hinduism) ఐక్యత లేకపోవడంతోనే మన ధర్మాని, దేవుళ్లను అవమానిస్తున్నారని ఆరోపించారు. దీక్ష విరమణ తర్వాత కూడా తనకు రాజకీయాలు పదవులు ముఖ్యం కాదని, సనాతన ధర్మం పరిరక్షించబడాలన్నారు. తన ధర్మం జోలికి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదని ప్రకటించారు.  సనాతన ధర్మ పరిరక్షణకు పవన్‌ పోరాటం వెనుక ఉద్దేవం వేరే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమ్యూనిస్టు వాదిగా రాజకీయాల్లోకి వచ్చి.. ఇప్పుడు పూర్తిగా హిందూ ధర్మ పరిరక్షకుడిగా మారడానికి కారణాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు(Political Pandits). ఏపీలో, తెలంగాణలో ఒంటరిగా అధికారంలోకి రావాలని బీజేపీ (BJP) ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా మారడానికే పవన్‌ ఇలా సనాతన ధర్మాన్ని భుజానికెత్తుకున్నారని పేర్కొంటున్నారు. దశాబ్ద రాజకీయ నేపథ్యంలో డిప్యూటీ సీఎం అయిన పవన్‌.. మరో పదేళ్లలో ఏపీ సీఎం కావాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.