Site icon HashtagU Telugu

NTR Bharosa Pension Scheme : ఏపీలో 4 రోజుల ముందుగానే పెన్షన్

Ntr Bharosa Pension Scheme

Ntr Bharosa Pension Scheme

ఏపీ సర్కార్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ (NTR Bharosa Pension Scheme) దారులకు శుభవార్త తెలిపింది. జులై నెల రేషన్‌ను ఈ నెల 26వ తేదీ నుంచే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా రేషన్‌ను ఇంటికే డోర్ డెలివరీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గత నెలలో సమాచార లోపం వల్ల చాలా మంది వృద్ధులు డిపోల దగ్గరకు వెళ్లాల్సి వచ్చిన ఘటన నేపథ్యంలో ఈసారి ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Gut Health: జీర్ణవ్యవస్థ బ‌లంగా ఉండాలంటే.. ఇలాంటి ఫుడ్ తీసుకోవాల్సిందే!

ఇక మరో విషయం.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద “స్పౌజ్ పింఛన్లు” జూన్ నెల నుంచే మంజూరు చేశారు. భర్త మృతి చెందిన తర్వాత అతడి భార్యకు నెలకు రూ.4000 చొప్పున పెన్షన్ మంజూరు చేయడం ద్వారా ప్రభుత్వం ఆ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడుతోంది. తాజాగా కొత్తగా 71,380 మందికి ఈ స్పౌజ్ కేటగిరీలో పింఛన్లు మంజూరు చేశారు. ఇది కూటమి ప్రభుత్వ సామాజిక సంక్షేమంపై దృష్టిని ప్రతిబింబిస్తుంది.

పింఛన్ పరంగా ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. వృద్ధుల పెన్షన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకి, దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకి పెంచారు. పూర్తిగా వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేల పింఛన్, అలాగే కిడ్నీ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు రూ.10 వేల పింఛన్‌ను మంజూరు చేశారు. ప్రజల ధనం వృథా కాకుండా చూడాలని భావించిన ప్రభుత్వం, గత ఐదేళ్లుగా వాడిన రేషన్ వాహనాలను ఇతర ప్రభుత్వ పనులకు వినియోగించనుంది. అయితే వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం ఇంటికే రేషన్ పంపిణీ కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు.