వైస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఫై వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరిన..ఎవరు ఉన్న మీము రాజకీయ ప్రత్యర్ధిగానే చూస్తాం అన్నారు. తెలంగాణ లో షర్మిల స్థాపించిన YSRTP పార్టీని నేడు కాంగ్రెస్ లో విలీనం చేసింది. రాహుల్ సమక్షంలో నేడు షర్మిల (Sharmila ) కాంగ్రెస్ కండువా కప్పుకుంది.
వైఎస్సార్ బిడ్డగా వైఎస్సార్టీపీ (YSRTP)ని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని వైఎస్ షర్మిల ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు. తన తండ్రి వైఎస్ బతికుండగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని, అందులోనే ఆయన అసువులుబాశారని షర్మిల గుర్తుచేశారు. వైఎస్సార్ బిడ్డగా తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దేశ సెక్యులర్ పునాదుల్లో భాగమైన కాంగ్రెస్ పార్టీలో తాను భాగమవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పనిచేస్తానని వైఎస్ షర్మిల తెలిపారు. తాను వైఎస్సార్ అడుగు జాడల్లో నడుస్తున్నట్లు షర్మిల తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నది తన తండ్రి వైఎస్సార్ కల అని, దాన్ని నెరవేర్చే యత్నంలో తాను భాగస్వామిని అవుతున్నందుకు షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రతీ ఒక్కరి ఆకాంక్షలు నెరవేరుస్తుందన్న నమ్మకం తనకు ఉందంటూ పార్టీ లో చేరిన అనంతరం చెప్పుకొచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
ఏపీలో షర్మిల కు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందనే చర్చ కొనసాగుతున్న వేళ.. వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు.. మా కాళ్లను మేం నరుక్కోం.. కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరిన..ఎవరు ఉన్నా రాజకీయ ప్రత్యర్ధిగానే చూస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ఇక, రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజం.. సీఎం వైఎస్ జగన్ మా నాయకుడు ఆయన కోసం మేం ఎప్పటికీ పని చేస్తూనే ఉంటాం అన్నారు.
కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియా గాంధీ, చంద్రబాబుది అంటూ మండిపడ్డారు.. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్న ఆయన.. రాష్ట్ర ప్రజలందరూ సీఎం వైఎస్ జగన్ ను గెలిపించాలని చూస్తున్నారని స్పష్టం చేశారు. అలాగే ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఫై కూడా పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. జెడ్పీటీసీగా ఓడిన వ్యక్తిని మేం ఎమ్మెల్యేగా గెలిపించాం.. అలాంటి వ్యక్తి ఈరోజు జగన్ ఫై విమర్శలు చేయడం దారుణం అన్నారు. ఎవరో రెచ్చగొడితే అలా మాట్లాడటం సబబు కాదు అని.. ఇప్పటికైనా అయన పునరాలోచలో చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Read Also : YSRTP Prasthanam : ముగిసిన షర్మిల YSRTP ప్రస్థానం