కాలేజీ (College) లో చదువుకునే టైం లో చంద్రబాబు (Chandrababu) ను పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి (Peddireddy Attack) కొట్టాడని..ఆ కోపం తో చంద్రబాబు.. పెద్దిరెడ్డి ఫై పగ పెంచుకున్నారని వైసీపీ అధినేత జగన్ చెప్పడం ఇప్పుడు అంత మాట్లాడుకునేలా చేసింది. ఏపీలో ప్రస్తుతం వైసీపీ నేతల పరిస్థితి ఎలా ఉందొ చెప్పాల్సిన పనిలేదు. గడిచిన ఐదేళ్లలో చేసిన నేరాలు , ఘోరాలు , అక్రమాలకు భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ వరుసగా కేసులు నమోదు చేస్తుంది. ఇక వైసీపీ లో కీలక నేత గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి (Peddireddy Ramachandra Reddy) కి సైతం వరుస షాకులు ఇచ్చేందుకు కూటమి సర్కార్ సిద్ధం అయ్యింది. ఇప్పటికే పలు కేసులు నమోదు కాగా.. తాజాగా మదనపల్లి ఫైర్ యాక్సిడెంట్ కేసులో తన పేరు బయటకు రావడం తో ఇక తనకు ఇబ్బందులు తప్పవని అంచనాకు వచ్చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో జగన్ ఈరోజు మీడియా సమావేశంలో ఓ స్టోరీ చెప్పుకొచ్చారు. పెద్దిరెడ్డి , చంద్రబాబుది ఇద్దరిది ఒకే జిల్లా. ఒకప్పుడు క్లాస్ మేట్స్ కూడా. ఇద్దరూ కలిసి చదువుకున్నారనే విషయం తెలిసిందే. అంత స్నేహంగా ఉండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- చంద్రబాబు మధ్య గొడవలు వచ్చాయి. చదువుకునేటప్పుడు పెద్దిరెడ్డి.. చంద్రబాబుని కొట్టారు. ఆ కోపాన్ని చంద్రబాబు ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నాడు. ఎలాగైనా పెద్దిరెడ్డిని తొక్కాలని చంద్రబాబు విపరీతంగా ప్రయత్నం చేస్తుంటాడని జగన్ చెప్పుకొచ్చారు. అందుకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే చంద్రబాబుకు పీకలదాకా కోపం ఉంటుందని ..పెద్దిరెడ్డి కుటుంబాన్ని నాశనం చేయాలని, అవకాశం దొరికినప్పుడల్లా బండ వేయాలని చూస్తుంటాడని జగన్ తెలిపారు. ఆ కక్షతోనే పెద్దిరెడ్డి గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఎక్కడికి వెళ్లినా.. దాడులు చేయాలని చంద్రబాబు చూస్తుంటాడని జగన్ ఆరోపించారు. జగన్ చెప్పిన మాటలు విని టిడిపి శ్రేణులు , నేతలు నవ్వుకుంటున్నారు. ఈ తనను కొట్టిన విషయం చంద్రబాబు కు తెలుసా..? అది కూడా మరచిపోయాడని జగన్ అంటాడా..? అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి నిజంగా పెద్దిరెడ్డి కొట్టడా..లేదా అనేది బాబు క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
Read Also : IND W vs BAN W: బంగ్లాదేశ్‌ని చిత్తుగా ఓడించిన భారత్, ఫైనల్ బెర్త్ ఖరారు
