Payyavula Keshav: ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పోలవరం ప్రాజెక్టును ప్రత్యేకంగా రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి ఎంతో గొప్ప వరంగా అభివర్ణించారు. ఆయన మాట్లాడుతూ, “పోలవరం ఏ ఒక్క ప్రాంతానికి మాత్రమే కాదు, మొత్తం రాష్ట్ర రైతాంగానికి గొప్ప వరం,” అని తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ “కన్నతల్లికి దణ్ణం పెట్టలేని జగన్, తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని” ఆయన విమర్శించారు.
9 వేల మంది పోలవరం నిర్వాసితులకు దాదాపు వెయ్యి కోట్లు భద్రపరచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనలతో ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. “ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించాం,” అని పయ్యావుల కేశవ్ చెప్పారు.
KTR : అతి విశ్వాసం, చిన్నచిన్న తప్పిదాలతో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాం
ఇదేకాకుండా.. పోలవరంపై మరింతగా ఆయన మాట్లాడుతూ.. “5 నెలల్లో పోలవరం కోసం చేసిన పరిష్కారంలో 5 శాతం కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం నిర్మాణానికి చేశారా?” అని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. “పోలవరం ముంపు గ్రామాలు వరద ముంపునకు గురైనప్పుడు, సీఎం చంద్రబాబు కళ్లారా నిర్వాసితుల బాధలు చూశారు,” అని ఆయన పేర్కొన్నారు.
రాయలసీమలో పట్టిసీమ తర్వాత గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని, రైతు కష్టాలను తీర్చేందుకు 24 గంటల్లోనే ధాన్యం కొనుగోళ్ల నిధులు జమ చేస్తున్నామని ఆయన వివరించారు. “ప్రాజెక్టుల్లో నీళ్లు నింపి రైతుల జీవితాల్లో వెలుగులు చూస్తున్నాం,” అని మంత్రి పయ్యావుల చెప్పారు.
మరోవైపు, వైఎస్ జగన్ పాలనలో కొన్ని అనర్హుల పేరిట ఫైనాన్షియల్ తొలిగింపు కార్యక్రమం జరుగుతోందని, ఈ అంశంపై జగన్ శ్రేణులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. “రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే ఆతృత జగన్ కు అనవసరం,” అని ఆయన సెటైర్లు వేశారు.
Jasprit Bumrah: బుమ్రా హెల్త్ అప్డేట్ ఇదే.. బ్యాటింగ్ ఓకే.. బౌలింగే డౌట్?