Site icon HashtagU Telugu

Pawan Kalyan : పార్టీ ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Pawan's Warning To Party Ml

Pawan's Warning To Party Ml

జనసేన అధినేత పవన్ కళ్యాణ్..తన పార్టీ ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. పదేళ్ల రాజకీయ ప్రయాణంలో మొదటిసారి ఎమ్మెల్యే గా విజయం సాధించి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో , పార్టీ శ్రేణుల్లో సంతోషం నింపారు. ఆయన గెలవడమే కాదు బరిలో నిల్చున్న 21 మంది భారీ మెజార్టీ తో విజయ డంఖా మోగించి జనసేన సత్తా ఏంటో నిరూపించింది. ఈరోజు రాష్ట్రంలో కూటమి విజయం సాధించిందంటే అందులో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో ఉందని చెప్పాల్సిన పనిలేదు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈరోజు జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్‌ కల్యాణ్​ను ఆ పార్టీ ఎన్నుకుంది. మంగళవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌ పేరును నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. నాదెండ్ల ప్రతిపాదనను జనసేన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా బలపరిచారు. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సందర్బంగా పార్టీ ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘పాతతరం రాజకీయాలకు కాలం చెల్లింది. అప్పటిలా కూర్చొని పవర్ ఎంజాయ్ చేద్దామనుకుంటే కుదరదు. ప్రజలు మనకు ఎంత మద్దతిచ్చారో వారికి కోపం వస్తే అంతే బలంగా నిలదీయగలరు. ఏదైనా సందర్భంలో వారు ఓ మాట అంటే భరించాలి. ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయవద్దు’ అని పవన్ కళ్యాణ్ సూచించారు.

గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయని పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి కట్టుగా పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందని తెలిపారు. ఇది అద్భుతమైన విజయమని, ఎన్డీయే కూటమి అంటే ఎలా ఉండాలో రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా చూపించారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఇప్పటం సభలో చెప్పానని, అదే మాటపై నిలబడ్డానని గుర్తు చేసుకున్నారు. ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం.. తగ్గాం.. ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. కక్ష సాధింపులకు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని, సమష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని సూచించారు. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, శాంతి భద్రతల విషయంలో బలంగా నిలబడతామని చెప్పామని స్పష్టం చేశారు.

Read Also : Ramoji Rao : రామోజీ రావు కు సీఎం రేవంత్ రెడ్డి నివాళి