Site icon HashtagU Telugu

Pawan Kalyan : సరికొత్త వివాదానికి తెరలేపిన పవన్ వ్యాఖ్యలు

Pawan Krishna

Pawan Krishna

ఏపీలో ఎన్నికల (Elections Time) సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల మధ్య మాటల తూటాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమి నేతలు..జగన్ ఫై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా తగ్గేదెలా అంటూ ఓ రేంజ్ లో తన దూకుడు ను పెంచుతున్నారు. ఓపక్క అనారోగ్యం వెంటాడుతున్నప్పటికీ..దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

ఇదే తరుణంలో వైసీపీ (YCP) కూడా ఏ చిన్న ఛాన్స్ వచ్చిన ఎదురుదాడి చేయాలంటూ చూస్తుంది. ఈ క్రమంలో రాజానగరం (Rajanagaram సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తూ..మహేష్ (Mahesh Babu) అభిమానుల్లో ఆగ్రహం నింపుతున్నారు. గతంలో ఎన్టీఆర్ (NTR) వంటి వారు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణ వంటి వారు ఎన్ని విమర్శలు చేసినా వారిని ఎన్టీఆర్ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని, అది ఆయన సంస్కారమని పవన్ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ వ్యాఖ్యలను ఆసరాగా చేసుకొని వైసీపీ శ్రేణులు పవన్ వ్యాఖ్యలను సోషల్ మీడియా లో వైరల్ చేస్తూ..మహేష్ , కృష్ణ అభిమానుల్లో ఆగ్రహం పెంచుతున్నారు. ఎన్టీఆర్ మాత్రమే సంస్కారవంతుడు, కృష్ణ కాదా అంటూ సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కృష్ణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను అందరూ ఖండించాలని కోరుతున్నారు. జనసేన శ్రేణులు మాత్రం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థిస్తూ దానిపై క్లారిటీ ఇస్తూ..వైసీపీ కి కౌంటర్లు ఇస్తున్నారు.

పవన్ ఎన్టీఆర్ కు సంస్కారం ఉందని చెప్పినంత మాత్రాన కృష్ణకు లేదని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ – నందమూరి తారకరామారావు గారి లాంటి వారు చేసిన హుందా రాజకీయాల నుండి నేర్చుకోవాల్సింది పోయి వారి కుటుంబాలపై కక్ష కట్టాడు జగన్, ఇలాంటి ఎన్నో నీతిమాలిన పనులు చేసిన జగన్ ను తరిమేయాల్సిన బాధ్యత కేవలం కృష్ణ, ఎన్టీఆర్ గారి అభిమానులపైనే కాదు, ప్రతీ సినీ హీరో అభిమానిపై ఉందని జనసేన పార్టీ పోస్టు చేసింది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో..దీనిపై పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి.

Read Also : Lok Sabha Polls 2024: ఎన్నికలో ప్రచారంలో బిజీబిజీగా సీఎం రేవంత్…ఈ రోజు షెడ్యూల్ ఇదే