Site icon HashtagU Telugu

Pawan Warning To YCP: మ‌రోసారి వైసీపీని హెచ్చరించిన ప‌వ‌న్‌.. ఏమ‌న్నారంటే?

Pawan Warning To YCP

Pawan Warning To YCP

Pawan Warning To YCP: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Warning To YCP) ఇటీవ‌ల హోం శాఖ‌పై అదే విధంగా పోలీసుల‌పై చేసిన వ్యాఖ్య‌లు ఎంత వైర‌ల్ అయ్యాయో తెలిసిందే. అయితే తాజాగా మ‌రోసారి ప్ర‌తిపక్ష పార్టీ వైసీపీని టార్గెట్ చేస్తూ కొన్ని ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారుల‌ను బెదిరిస్తే కేసులు పెట్టాల్సి ఉంటుంద‌ని జ‌గ‌న్‌కు ప‌రోక్షంగా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఇటీవ‌ల జ‌గ‌న్ ఐఏఎస్ అధికారుల‌ను త‌న‌దైన శైలిలో వార్నింగ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆ వ్యాఖ్య‌ల‌ను ప‌వ‌న్ తాజాగా కౌంట‌ర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

గుంటూరులో జ‌రిగిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. విధుల్లో ప్రాణాలు అర్పించిన అధికారులు, సిబ్బందికి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎంతోమంది అటవీశాఖ సిబ్బంది స్మగ్లర్ల చేతితో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వీరప్పన్ లాంటి వారితో పోరాటం చేసి.. వన్య సంపద, వన్య ప్రాణులను కాపాడారని కొనియాడారు. స్మగ్లింగ్‌ను నివారించేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.

Also Read: CM Revanth: మహబూబ్‌నగర్ జిల్లా యువ‌త‌కు సీఎం రేవంత్ బంప‌రాఫ‌ర్‌.. త్వ‌ర‌లోనే 2 వేల ఉద్యోగాలు!

అలాగే వైసీపీ నేత‌ల‌కు కూడా వార్నింగ్ ఇచ్చారు. త‌మ‌ది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ‘‘ఐఏఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతాం. అధికారుల మీద చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకోం. మహిళా భద్రత విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి’’అని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. అలాగే ఏపీ పీసీసీ చీఫ్ ష‌ర్మిల భ‌ద్ర‌త కావాల‌ని అడిగితే ప్ర‌భుత్వం త‌ర‌పున సెక్యూరిటీ క‌ల్పిస్తామ‌ని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు.

ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌లో అప‌శృతి

ముందుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుంటూరు పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. పవన్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు రోడ్డు బ్లాక్ చేయ‌టంతో అంబులెన్స్ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయింది. అంబులెన్స్‌కు పోలీసులు దారి ఇవ్వకపోవడంతో రోగి పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. దీని గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.