విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన ప్యాలెస్( Rushikonda Palace)ను జనసేన అధినేత , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Visit) సందర్శించారు. స్థానిక ఎంపీ భరత్ (MP Bharath) తో పాటు ఎమ్మెల్యేలు కూడా ఆయనతో కలసి ఈ భవన సముదాయాల్లో తిరిగారు. రుషికొండ పై నుంచి బీచ్ అందాలను ఆస్వాదిస్తూ పవన్ కళ్యాణ్ ఫొటోలు తీసుకున్నారు. ప్యాలెస్ వద్ద పనిచేస్తున్న కార్మికులతో ఆయన చర్చలు జరిపి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్శనకు సంబంధించిన ఫొటోలను జనసేన ట్విటర్‌లో పంచుకుంది. పరిశీలన అనంతరం విశాఖ విమానాశ్రయానికి పవన్ కల్యాణ్ బయలుదేరి వెళ్లారు.
పవన్ కళ్యాణ్ ఆకస్మిక పర్యటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఆగస్టులో.. విశాఖ పర్యటనలో భాగంగా ఋషికొండ ఎర్రమటి దిబ్బలు సందర్శనకు వెళ్లారు పవన్ కళ్యాణ్. ఆ సమయంలో రుషికొండపై అనుమతించకపోవడంతో.. రోడ్డుపై నుంచే కాన్వాయ్ పైకెక్కి భవనాలను చూశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. డిప్యూటీ సీఎం గా పదవి దక్కించుకున్న పవన్ కళ్యాణ్.. నేరుగా కాన్వాయ్ తోనే రుషికొండ పైకి వెళ్లారు. అప్పుడు అలా ఇప్పుడు ఇలా అంటూ అభిమానులు, జనసేన శ్రేణులు చర్చించుకుంటున్నారు.
Read Also : CM Revanth Reddy : యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన