Site icon HashtagU Telugu

ఓటరు జాబితా సర్వేలో వాలంటీర్లు పాల్గొనడం ఫై పవన్ ట్వీట్

Pawan Tweet On Voter Survey

Pawan Tweet On Voter Survey

ఏపీ (AP)లో ఓటరు జాబితా సర్వే నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓటరు జాబితా సర్వే లో వాలంటీర్లు పాల్గొంటున్నట్లు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం అవుతుండడం తో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఓటరు జాబితా సర్వే లో వాలంటీర్లు పాల్గొనడం చట్ట విరుద్ధమన్నారు.

‘ఓటరు జాబితా తయారీ నుంచి ఫలితాల ప్రకటన వరకు మొత్తం ఎన్నికల ప్రక్రియలో నిష్పక్షపాతం, పారదర్శకతతో వ్యవహరించాలి. ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ వైస్సార్సీపీ నేతలు బూత్ లెవల్ అధికారులతో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వాలంటీర్లు (AP Volunteer) ఇంటింటికి సర్వే ప్రక్రియలో భాగమవుతున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన, ఏపీలో వైస్సార్సీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. ఏపీలో అవసరమైన నిబంధనలను తక్షణమే అమలు చేయాలి.” అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

ఇక ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. రీసెంట్ గా ఉభయ గోదావరి , ఏలూరు జిల్లాలో వారాహి యాత్ర (Varahi Yatra)ను పూర్తి చేసారు. ఈ యాత్ర కు ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే , జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏంచేస్తుందో తెలియజేసారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ లో జరుగుతున్న లోపాలపై పవన్ సంచలన ఆరోపణలు చేసారు. ఈ ఆరోపణల ఫై ప్రభుత్వం పవన్ ను విచారించాలని ఆదేశాలు జారీచేసింది. దీనిపై పవన్ కూడా సై అంటున్నాడు. రాబోయే రోజుల్లో జనసేనాని దూకుడు ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అని అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : BRO ట్రైలర్ టాక్ : టైం లేదు..టైం లేదు చూసేయాల్సిందే