Pawan Kalyan Suffering From Fever : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రెండు రోజులుగా విపరీతమైన జ్వరం (Fever ) , దగ్గుతో బాధపడుతున్నారు. అయినప్పటికీ జ్వరాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా వరదలకు సంబదించిన సమాచారం..అధికారులు చేయవల్సిన చర్యలు వంటివి సమీక్షిస్తూ వస్తున్నారు. ఈరోజు కూడా తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అన్న నీ ఆరోగ్యం జాగ్రత్త
వరదలు , భారీ వర్షాల కారణంగా అంటువ్యాదులు ప్రబలే ప్రమాదం ఉందని, అలాగే దోమల బెడద కూడా ఎక్కువ అవుతుందని..వెంటనే పారిశుద్ధ్య పనులు మొదలుపెట్టాలని , స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏలేరు రిజర్వాయర్ కి వరద ముప్పుపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుపాలని సూచించారు. ఓ పక్క జ్వరంతో బాధపడుతూ కూడా ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకూడదని , ముఖ్యముగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించడం పట్ల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై అధికారులు, పార్టీ నేతలు , శ్రేణులు , అభిమానులు ఇలా ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్న నీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ జాగ్రత్త తెలుపుతున్నారు.
ఇదిలా ఉంటె రెండు తెలుగు రాష్ట్రాలకు సాయం (Donation ) అందిస్తున్న చిత్రసీమ (Tollywood Heros) కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. మహేశ్ బాబు (రూ.50 లక్షలు), ప్రభాస్ (రూ.కోటి), నందమూరి బాలకృష్ణ (రూ.50 లక్షలు), ఎన్టీఆర్ కోటి , చిరంజీవి కోటి ఇలా సాయం ప్రకటించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అంటూ, ఉప ముఖ్యమంత్రి అభినందిస్తున్నారని పార్టీ ట్వీట్ చేసింది. కష్టకాలంలో ప్రజలకు అండగా, సహాయం చేసిన వారి ఔదార్యం మరెంతోమందికి భరోసా కల్పిస్తుందని పేర్కొంది.
Read Also : Free Electricity : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్: డిప్యూటీ సీఎం